Advertisement


Home > Politics - Gossip
ఉభయ గోదావరిలో పట్టుకు జగన్‌ సన్నాహాలు!

పాదయాత్ర నేపథ్యంలో తూ.గో.జిల్లాలో ఝలక్‌

ఉభయగోదావరి జిల్లాల్లో పట్టు సాధించేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత, ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నారు. 2019సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని అందిపుచ్చుకోవాలన్న ఏకైన అజెండాతో ప్రజా సంకల్ప యాత్రకు జగన్మోహన్‌రెడ్డి సన్నద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఆయనకు ఝలక్‌ తగిలింది. జిల్లాలోని రంపచోడవరం అసెంబ్లీ సభ్యురాలు వంతల రాజేశ్వరి తెలుగుదేశం గూటికి చేరి జగన్‌కు షాక్‌ ఇచ్చారు. రంపచోడవరం పమ్మెల్యే సరిగ్గా జగన్‌ పాదయాత్రకు సిద్ధమైన సందర్భంలో వైసీపీని వీడి అధికార పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి వెనుక పెద్ద వ్యూహమే దాగివున్నట్టు స్పష్టమవుతోంది.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యూహమే దాగివున్నట్టు స్పష్టమవుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వంతల అరంగేట్రాన్ని జగన్‌ పాదయాత్ర సందర్భంలో జరిగేలా చేయడంతో విజయవంతమయ్యారు. వంతల రాజీనామా వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం కాగా, తమకు బాగా మైలేజీ పెరిగినట్టు దేశంనేతలు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మరికొందరు వైసీపీ కీలకనేతలు త్వరలో తమ పార్టీలో చేరనున్నట్టు చెబుతున్నారు. ఈ పరిణామం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ జగన్‌ పార్టీకి శిరోభారంగా మారింది.

దీంతో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్యనేతలతో జగన్‌ సంప్రదింపులు జరుపుతున్నారు. ఉన్న ఇద్దరు పమ్మెల్యేలు సహా పార్టీ ముఖ్యనేతలు, కీలకనేతల్లో ఇంకెవరైనా ఫిరాయింపులకు పాల్పడే అవకాశాలున్నాయా? అన్న విషయమై ఆయన ఆరా తీస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలు రాజకీయంగా సెంటిమెంట్‌ జిల్లాలుగా పేరొందాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల్లో ఘోరంగా పరాజయాన్ని చవి చూసింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి కనీసం ఒక్క అసెంబ్లీ సీటు కూడా 2014లో లభించకపోవడం గమనార్హం! ఆ జిల్లాలోని మొత్తం 15అసెంబ్లీ సీట్లు మిత్రపక్షమైన బీజేపీ-టీడీపీ వశమయ్యాయి. ఇక తూర్పు గోదావరి జిల్లాలో 19అసెంబ్లీ స్థానాలకు గాను 2014 ఎన్నికల్లో 5 అసెంబ్లీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది.

పిఠాపురం అసెంబ్లీ స్థానం మినహా మిగిలిన 13 స్థానాలను తెలుగుదేశం సాధించుకుంది. పిఠాపురం నుండి టీడీపీ రెబర్‌గా పోటీచేసి గెలుపొందిన ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మ కూడా తర్వాత తెలుగుదేశంలో చేరారు. ఈ జిల్లాలో వైసీపీకి ఉన్న ఐదుగురు పమ్మెల్యేలలో జగ్గంపేట, ప్రత్తిపాడు పమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు దేశం తీర్ధం పుచ్చుకోవడం అప్పట్లో కలకలం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వైసీపీ పమ్మెల్యేలు ఫిరాయింపుల్లో భాగంగా వీరిద్దరూ అప్పట్లో అధికార పార్టీలో చేరారు. మళ్ళీ రంపచోడవరం పమ్మెల్యే వంతల రాజేశ్వరి కూడా దేశం తీర్ధం పుచ్చుకోవడంతో వైసీపీ పమ్మెల్యేల సంఖ్య రెండుకు దిగజారగా అధికార టీడీపీ సభ్యుల సంఖ్య 17కు చేరింది.

ప్రస్తుతం తుని పమ్మెల్యే దాడిశెట్టి రాజా, కొత్తపేట పమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వైసీపీలో ఉన్నారు. ఇదిలావుంటే జగన్‌ అవలంభిస్తున్న విధానాలు, ఆయన వ్యవహార శైలికి నచ్చకపోవడం వలనే వైసీపీకి చెందిన పమ్మెల్యేలు దేశంలో చేరుతున్నారని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శిస్తున్నారు. రంపచోడవరం పమ్మెల్యే వంతల రాజేశ్వరి జగన్‌ వైఖరి నచ్చని కారణంగానే టీడీపీలో చేరారని, జిల్లాలోని వైసీపీకి చెందిన మరో పమ్మెల్యే తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.

జగన్‌ పాదయాత్రకు అనుమతి తీసుకుంటేనే ఆయా జిల్లాలో పోలీసులతో సెక్యూరిటీని కల్పిస్తామని, ఆయా జిల్లాలలో ప్రవేశించిన వెంటనే సంబంధిత ఎస్పీలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జగన్‌ అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తి వాటిని అధికార పక్షం దృష్టికి తీసుకురావాలని, అలా కాకుండా అసెంబ్లీకి హాజరుకాకుండా పాదయాత్ర చేయడం సరికాదని, ప్రజా సమస్యల పరిష్కారంపై జగన్‌కు చిత్తశుద్ధి లేదని జగన్‌పై చినరాజప్ప మాటల దాడి చేస్తున్నారు.