cloudfront

Advertisement


Home > Politics - Gossip

డబ్బులు కడతానంటున్న మాల్యా.. అసలు కథ అదే!

డబ్బులు కడతానంటున్న మాల్యా.. అసలు కథ అదే!

తను తొమ్మిది వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని ట్వీటాడు విజయ్ మాల్యా. ఇండియాలో బ్యాంకుల నుంచి భారీగా లోన్లను తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా  విదేశాలకు పారిపోయిన ఈ లిక్కర్ కింగ్.. తెల్ల జెండాను చూపుతూ వరస ట్వీట్లు పెట్టాడు. తను లోన్లను వందశాతం తిరిగి చెల్లించడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించాడు. అయితే తనకు బ్యాంకర్లు సహకరించడం లేదని, కొందరు రాజకీయ నేతలు కూడా అడ్డుపడుతున్నారని.. అంతాకలిసి తనను దెబ్బతీయాలని చూస్తున్నారని మాల్యా అంటున్నాడు.

ఇదివరకూ కూడా ఈ రాజీ ప్రతిపాదనలను ట్విటర్ ద్వారా పంపుతున్నాడు మాల్యా. ఈసారి మాల్యా మళ్లీ ట్వీట్లు పెట్టడం వెనుక వేరే కథ ఉంది. ఈనెల పదోతేదీన మాల్యా విషయంలో యూకే కోర్టు తీర్పును వెల్లడించనుంది. మాల్యాను అప్పటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను అక్కడి కోర్టు విచారిస్తూ ఉంది. డిసెంబర్ పదోతేదీన దానికి సంబంధించి కీలకమైన తీర్పు రావొచ్చనే మాట వినిపిస్తోంది.

అలాగే అగస్టా వ్యవహారంలో తాజాగా ఇండియన్ గవర్నమెంట్ దుబాయ్ నుంచి మైఖేల్ అనే మధ్యవర్తిని ఇండియాకు రప్పించింది. దౌత్యపరమైన ఒత్తిడి ద్వారా దుబాయ్ నుంచి అతడిని ఇండియా రప్పించగలిగింది. ఇలాంటి నేపథ్యంలో మాల్యాలోనూ ఆందోళన మొదలైందని స్పష్టం అవుతోంది.

ఒకవేళ మాల్యాను ఇండియాకు అప్పగించాలని బ్రిటీష్ కోర్టు తీర్పునిస్తే.. అంతే సంగతులు. మాల్యా ఇండియాలోని జైల్లోకి వచ్చిపడాల్సి వస్తుంది. ఆ తర్వాత కథ ఎలా ఉంటుందో చెప్పడానికి వీలుండదు. డబ్బులకు డబ్బులూ వసూలు చేస్తారు, జైలుకు జైలూ తప్పదనే భయం మాల్యాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తను డబ్బులు కట్టేస్తానంటూ మాల్యా ట్వీట్లు పెడుతున్నాడు. 

అది లోకేష్ కెరీర్ కు మరింత మైనస్ కాదా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్