cloudfront

Advertisement


Home > Politics - Gossip

తెలంగాణ ఓటు.. కూకట్ పల్లిలోనే రేటెక్కువ!

తెలంగాణ ఓటు.. కూకట్ పల్లిలోనే రేటెక్కువ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోట్ల పంపిణీ శరవేగంగా జరుగుతూ ఉంది. ప్రచారం విరామం రోజున కోట్ల కట్టలు తెగుతూ ఉన్నాయి. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈసారి నోట్ల పంపిణీ జరుగుతోందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.

నోట్ల విషయంలో ఎప్పుడూ ఆంధ్రా ఏరియాలోనే ఎక్కువ స్థాయి మారకం జరిగేది. ఈసారి ఆంధ్రాకు ధీటుగా తెలంగాణలోనూ నోట్ల పంపిణీ జరుగుతుండటం విశేషం. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టుబడిన డబ్బే కోట్ల రూపాయల్లో ఉంది. మరి పంపకాలు ఏ రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోవడం కష్టం కాదిక్కడ.

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక్కో అభ్యర్థి ఐదు నుంచి పదికోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ విజయం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారని స్పష్టం అవుతోంది. ఈ ఐదు నుంచి పదికోట్ల రూపాయల మొత్తం అనేది కేవలం ఓట్ల కోసం ఇచ్చే నోట్ల విలువే!

ప్రచార సమయంలో ప్రతిరోజూ జనాలను వెంట తిప్పుకోవడానికి, కార్యకర్తల మీద పెట్టిన ఖర్చులు వేరే. ఈరోజు, రేపు ఉదయం తెగే నోట్లకట్టల విలువే నియోజకవర్గానికి ఐదు నుంచి పదికోట్ల రూపాయలు సునాయాసమని తెలుస్తోంది.

వీటిల్లో కూడా అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గాలు, బలమైన అభ్యర్థులు ఢీకొంటున్న చోట్ల ఈ కోట్లు మరిన్ని ఎక్కువ. పదిహేను, ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న అభ్యర్థులు కూడా ఉన్నారని స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం.. ఈ దఫా తెలంగాణ ఎన్నికల్లో అత్యంత కాస్ట్లీ నియోజకవర్గంగా కూకట్ పల్లి నిలుస్తోంది.

ఇక్కడ తెలుగుదేశం పార్టీకి విజయం అత్యంత ప్రతిష్టాత్మకం. ఇక్కడ సుహాసిని ఓడిపోతే తెలుగుదేశం పార్టీ పరువు పోవడం అంటే అది మామూలు అవమానం కాదు. అందుకే.. ఇక్కడ తెలుగుదేశం సర్వశక్తులూ ఒడ్డి ప్రయత్నాలు సాగిస్తోంది.

ఇప్పటికే ఎక్కడెక్కడి తెలుగుదేశం అనుకూల సామాజికవర్గం నేతలూ కూకట్  పల్లిలో దిగిపోయారు. ఇలాంటి నేపథ్యంలో... నేతలు బస చేసిన చోట కూడా భారీగా సొమ్ములు దొరుకుతున్నాయి. ఇప్పటికే పంపకాలు కూడా జరిగినట్టుగా సమాచారం.

క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. తెలుగుదేశం పార్టీ ఓటుకు ఐదు వేల రూపాయల వరకూ ఇస్తోంది. ఈ మేరకు డబ్బులు పొందిన వాళ్లు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. కూకట్ పల్లి పరిధిలో ఆరుగురు కుటుంబ సభ్యులున్న ఒక కుటుంబం ఏకంగా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని తీసుకున్నట్టుగా వివరించింది.

ఇక తెరాస కూడా తనవంతు ప్రయత్నాలు సాగిస్తోందని సమాచారం. అయితే ఓటుకు నోటు విషయంలో తెలుగుదేశం అభ్యర్థితో తెరాస అభ్యర్థి అక్కడ ఢీ కొట్టలేకపోతున్నాడని కూడా స్థానికుల నుంచి సమాచారం అందుతోంది.

సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్