Advertisement

Advertisement


Home > Politics - Gossip

మరీ ఇంతగానా... ‘ఈనాడు’ వారూ!!??

మరీ ఇంతగానా... ‘ఈనాడు’ వారూ!!??

పత్రికలు పార్టీలకు కరపత్రాలుగా ఏనాడో మారిపోయాయి. పత్రికల్లో రాజకీయ వార్తలు మినహా మిగిలిన వాటిని నమ్మితే చాలనే అభిప్రాయానికి ప్రజలు కూడా వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈనాడు మరో తప్పు చేసింది. ఎంతగా తెలుగుదేశానికి బాకా ఊదుతుంటుందనే భావన ప్రజల్లో ఉన్నప్పటికీ.. అంతో ఇంతో బ్యాలెన్స్ పాటిస్తున్నట్లుగా కనిపించే ఈనాడు అచ్చంగా వైకాపా మీద విషం చిమ్మడానికి దొరికిన ప్రతి అవకాశాన్నీ వాడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

ఈనాడు మంగళవారం ఎడిషన్ లో ఒక వార్త ప్రచురించారు. (సదరు వార్త లింక్ కోసం క్లిక్ చేయండి) ‘వైకాపాది అవకాశవాద రాజకీయం’ అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారనేది ఆ వార్త సారాంశం. ఆయన అరకులోయ సందర్శించినప్పుడు ప్రత్యేకించి న్యూస్‌టుడే విలేకరితో ఆ మాట చెప్పారుట! కనుక మరొక పత్రికలో ఆ వార్త కనిపించదు.

ఇంతాచేసి ఆ వార్తలో ఎక్కడా... బీవీ రాఘవులు , వైకాపా గురించి వ్యాఖ్యానించినట్లుగా ఒక్క వాక్యం కూడా లేదు. ఈసీతో రాష్ట్రప్రభుత్వానికి సమన్వయం లేక, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని... చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారని మాత్రమే ఆయన వ్యాఖ్యానించారు.

అయితే బీవీ రాఘవులు వైఎస్ జగన్ లేదా వైకాపా గురించి తనంతగా వ్యాఖ్యానించారో.. లేదా, వైకాపా గురించి కామెంట్ చేయమని ఈనాడు ప్రతినిధే అడిగి చెప్పించుకున్నారో మనకు తెలియదు గానీ... మొత్తానికి రాఘవులు వ్యాఖ్యగా వార్తలో లేని విషయాన్ని తీసుకువచ్చి హెడింగ్ లో పెట్టేశారు. మామూలుగా ఈ వార్త చదివితే.. వైకాపా మీద నిందవేయడం అనేది ఈనాడు వారికి అలవాటుగా మారిపోయిందేమో... వార్తలో అలాంటి పాయింటు లేకపోయినా సరే.. యథాలాపంగా హెడింగులో.. వైకాపాను నిందిస్తున్నట్లుగా వార్తలు రాసేస్తున్నారేమో అని అనిపిస్తుంది.

ఒక పార్టీకి భజన చేయడం, మేలు చేయడానికి వక్ర కథనాలను వండి వార్చడం ఎన్నికల సీజన్లో చేస్తే వారి సంబంధానికి ఆ మాత్రం భజన తప్పదులే అని అర్థం చేసుకోవచ్చు. ప్రత్యర్థి పార్టీల మీద విషం చిమ్మినా సర్లే అనుకోవచ్చు. అయితే... ఎన్నికల తంతు ముగిసిన తర్వాత కూడా ఇంతగా వైకాపా మీద విషం కక్కుతున్నారంటే ఏం అనుకోవాలి?

వంద సీట్ల మార్కును అందుకోవడంపై వైఎస్సార్సీపీ విశ్వాసం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?