cloudfront

Advertisement


Home > Politics - Gossip

నాగబాబు ఎంట్రీ: జనసేనకు ప్లస్సా.. మైనస్సా?

నాగబాబు ఎంట్రీ: జనసేనకు ప్లస్సా.. మైనస్సా?

నాగబాబు ముక్కుసూటిగా మాట్లాడతారు.. అందులో అనుమానమేం లేదు. భజనపరుల్ని దగ్గరకు రానివ్వరు, కష్టపడే వ్యక్తిత్వం ఉన్నవాళ్లకు సాయంచేసే గుణం ఆయనకుంది. అయితే ఇవన్నీ రాజకీయాలకు సరిపోవు. అందుకే ప్రజారాజ్యం సమయంలో నాగబాబు నాయకత్వం ఘోరంగా విఫలమైంది. ఆయన్ను నమ్ముకుని మెగాభిమానులంతా పార్టీలో చేరి దారుణంగా మోసపోయారు. అభిమానుల ప్రతినిధిగా ఉన్న నాగబాబు కంటే.. కార్పొరేట్లను చిరంజీవి దగ్గరకు తీసుకుపోతూ పార్టీపై ఎక్కువ డామినేషన్ చూపించారు అల్లు అరవింద్.

అది జరిగిన కథ, ఇక జరుగుతున్న కథ విషయానికొస్తే.. ప్రజారాజ్యం పతనానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న నాగబాబు ఇప్పుడు జనసేనలో కూడా దూరిపోయారు. ఇన్నాళ్లూ తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం పరోక్షంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న ఆయన.. తొలిసారి గుంటూరులో జనసేన కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే నాగబాబు ప్రత్యక్ష పాత్రలోకి దిగడం అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది.

ఉరుములేని పిడుగులా ఒక్కసారిగా నాగబాబు జనసేనలో యాక్టివ్ పొలిటీషియన్ గా మారిపోయారు. అయితే అన్నయ్య ఎంట్రీపై తమ్ముడు గుంభనంగా ఉన్నారు. చాలామంది పార్టీ నేతలకు కూడా కనీసం నాగబాబు జనసేన కోసం పనిచేస్తారనే విషయం తెలియదు. పవన్ కూడా చెప్పలేదు. సర్ ప్రైజ్ సంగతి అలా ఉంచితే, అసలు నాగబాబు అవసరం జనసేనకు ఉందా..? ఉంటే ఎంతవరకు అది పార్టీకి ఉపయోగం అనే విషయం తేలాల్సి ఉంది.

నాగబాబుకి రాజకీయానుభవం బొత్తిగాలేదు, ఇది ప్రజారాజ్యం విషయంలోనే రుజువైంది. అన్నయ్యను చాలామంది మిస్ లీడ్ చేశారు. సున్నిత మనస్కుడైన ఆయన్ను రిస్కుల్లోకి నెట్టారు అని నాగబాబు, పవన్ బాబు.. చాలాసార్లు బైటపడ్డారు. ప్రజారాజ్యం నుంచి బైటకు వెళ్లిపోయిన వారిని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టారు. ఆ తర్వాత అన్నయ్య అసలు పార్టీనే అమ్మేయడంతో వీరి నోటికి తాళం పడింది. ఇప్పుడు జనసేన విషయంలో కూడా నాగబాబు వ్యవహార శైలి పార్టీకి ఏమాత్రం ఉపయోగపడదు సరికదా అనేక అనర్థాలకు కారణమవుతుందని ఆ పార్టీనేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అభిమానులను చైతన్యపరచడం వరకు ఓకే కానీ, ఆ తర్వాత పార్టీ వ్యవహారాల్లో మెగా బ్రదర్ వేలు పెడితే కష్టమని అంటున్నారు. పవన్ కు సన్నిహితంగా ఉన్నవారు కూడా నాగబాబు రాకతో కాస్త అలెర్ట్ అయ్యారు. ఇంతకీ బాబుగారు పార్టీలో ఏం చేస్తారు, ఏం చేయబోతారనే విషయంపై 2-3 రోజుల్లో స్పష్టత వస్తుంది. నాగబాబు అసెంబ్లీ బరిలో దిగుతారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నిటినీ జనసేనాని పవనే క్లారిఫై చేయాలి. 

ఓట్లను కొనడంకాదు, మాయమే చేస్తున్నారు!

నన్ను ఏమైనా చేసినా డైరెక్ట్ సినిమా అందులోనే..