cloudfront

Advertisement


Home > Politics - Gossip

మోడీ సభ ఎవరికి లాభం..?

మోడీ సభ ఎవరికి లాభం..?

అనుకున్నంతా అయింది. గుంటూరు వేదికగా మూడు భారీ ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రి చంద్రబాబుకి చాకిరేవు పెట్టాడు. బాబుపై ఆయన ఈ స్థాయిలో ఫైర్ కావడం ఇదే తొలిసారి. కేంద్ర పథకాలు ఏకరువు పెట్టడంతో పాటు, చంద్రబాబు పొలిటికల్ క్రిమినల్ మైండ్ ని ఎండగట్టాడు.

అయితే ఇదంతా ఎవరికి లాభం. రాష్ట్రంలో చంద్రబాబుని మోడీ తిట్టడం వల్ల బీజేపీకి ఏమైనా ఉపయోగం ఉందా. కనీసం ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానమైనా సొంతంగా గెలుచుకునే అవకాశం దక్కుతుందా? ప్రస్తుతానికైతే మోడీ సభతో ఏపీ బీజేపీకి ఏమాత్రం లాభంలేదు.

ఇప్పటికే ప్రత్యేకహోదా విషయంలో బీజేపీని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ద్వేషిస్తున్నారు. విభజనతో కాంగ్రెస్ చేసిన పాపం కంటే, ప్రత్యేకహోదా ఇవ్వకుండా బీజేపీ చేసిన మోసమే ప్రజలకు ఎక్కువగా గుర్తుండిపోయింది. 2014లో కాంగ్రెస్ కి పట్టిన గతే, ఈ ఎన్నికల్లో బీజేపీకి కూడా పడుతుందని అందరూ డిసైడ్ అయిపోయారు. మరి మోడీ సభ ఎవరికి లాభం?

ఇప్పటివరకూ జగన్ కూడా చంద్రబాబు మోసపూరిత వైఖరిని ఎండగడుతూ వచ్చారు. ఇప్పుడు మోడీ కూడా కేంద్ర నిధులు, చంద్రబాబు నయవంచనపై ప్రజలకు క్లారిటీ ఇవ్వడంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుశాతం పెరిగే అవకాశాలున్నాయి. అయితే ఈ ఓట్లు బీజేపీకి కాకుండా వైసీపీకి మళ్లుతాయి. అంతమాత్రాన జగన్ కి మోడీ ఫేవర్ చేస్తున్నారని... జగన్-మోడీ మధ్య సయోధ్య కుదిరిందని అనుకోవడానికి వీళ్లేదు.

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడానికి ఏ పార్టీ ముందుకొస్తుందో కేంద్రంలో దానికే తన మద్దతు అని ఇప్పటికే జగన్ స్పష్టం చేశారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఏపీ ప్రజలు వైసీపీకే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే పలు సర్వేలు తెలిపాయి. కాకపోతే మోడీ సభతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు మరింతగా ఏకమయ్యే ఆస్కారం ఏర్పడింది.