cloudfront

Advertisement


Home > Politics - Gossip

చంద్రబాబు 'మమతా'నురాగాలు

చంద్రబాబు 'మమతా'నురాగాలు

వీలైనంత ఎక్కువగా మోదీని తిట్టాలి, మోదీ ద్వేషిగా ముద్ర వేయంచుకోవాలి, ప్రత్యేకహోదా విషయంలో సానుభూతి పొందాలి, కల్లబొల్లి మాటలతో ఓట్లు కొల్లగొట్టాలి. స్థూలంగా చంద్రబాబు వ్యూహం ఇదీ. అందుకే ఎప్పుడూ లేనిది మమతా బెనర్జీ విషయంలో భూమి బద్దలైనట్టుగా స్పందిస్తున్నారు బాబు.

మమత దీక్షకు దిగిన వెంటనే సంఘీభావం ప్రకటించిన చంద్రబాబు, కేంద్రంపై దుమ్మెత్తి పోశారు. ఇప్పుడామె దీక్ష విమరణకు స్వయంగా హాజరై దేశ రాజకీయాలను తానేదో చక్కబెడుతున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. కేంద్రం నిరంకుశ వైఖరి నశించాలంటూ నినాదాలు చేస్తున్నాడు.

రాజకీయ కక్షతో టీడీపీ నేతలపై కూడా సీబీఐ విచారణకు దిగిందని మొత్తుకుంటున్న చంద్రబాబుకి ఇప్పుడు మమత తోడు దొరికింది. తోడు దొంగలిద్దరూ కలసికట్టుగా కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. తాజా వివాదంలో విచారణకు సహకరించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మమతకి చెంపపెట్టు కాగా, చంద్రబాబుకి కూడా అదే వర్తిస్తుంది. అయితే కావాలనే కేంద్రంతో కయ్యానికి దిగుతున్నారు బాబు.

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు ప్రత్యేకహోదా చుట్టూ తిరుగుతున్నాయి. ప్రత్యేకహోదా ఇస్తామని హామీఇచ్చి మాటతప్పిన బీజేపీపై ప్రజలు కసితో ఉన్నారు. అమిత్ షా పర్యటనలోనే ఈ విషయం స్పష్టమైంది. దీంతో చంద్రబాబు ప్రత్యేకహోదా అంశాన్ని హైజాక్ చేయడానికి రెడీ అవుతున్నారు. నల్లచొక్కాలు వేసుకుని నాటకాలాడుతూ, ఢిల్లీలో దీక్షలంటూ కేంద్రాన్ని రెచ్చగొడుతున్నాడు.

బీజేపీని, మోదీని రెచ్చగొట్టి.. వారు ఎదురు తిరిగితే సింపతీ కొట్టేయాలనేది చంద్రబాబు ప్లాన్. పనిలో పనిగా బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ప్రచారం చేస్తున్నాడు. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడంతో బీజేపీపై ఉన్న వ్యతిరేక, రాష్ట్ర విభజన విషయంలో టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను వైసీపీ వైపు మళ్లించేలా మరో మాస్టర్ ప్లాన్ వేశాడు చంద్రబాబు.

బీజేపీని తిట్టడం, వైసీపీ-బీజేపీ దోస్తులుగా ప్రచారం చేయడం ఇదీ చంద్రబాబు ముందున్న రెండు ప్రధాన లక్ష్యాలు. అందుకే ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టడంలేదు. అవకాశాలను సృష్టించుకుని మరీ రెచ్చిపోతున్నాడు. తాజాగా చంద్రబాబు కోల్ కతా ట్రిప్ కి కూడా ప్రధాన కారణం ఇదే. మమతపై బాబు కురిపిస్తున్న అభిమానానికి, ఆప్యాయత వెనక అసలు అజెండా ఇదే. 

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?