Advertisement

Advertisement


Home > Politics - Gossip

చంద్రబాబు హైదరాబాదులో ఎందుకుంటున్నారు?

చంద్రబాబు హైదరాబాదులో ఎందుకుంటున్నారు?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మంగళవారం నాడు ఒక సూటి ప్రశ్న ఎదురైంది. ఏపీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. రాష్ట్రం ఇంత పెద్ద విపత్తుతో పోరాడుతున్నప్పుడు చంద్రబాబునాయుడు హైదరాబాదులో ఉండి లేఖలు రాయడం, ట్వీట్లు చేయడంతో సరిపెట్టుకోకుండా.. రాష్ట్రంలో ఉండి ప్రజలను ఆదుకునేందుకు శ్రద్ధ పెట్టాలని కన్నబాబు అన్నారు. అవును నిజమే. ఇన్ని రోజులుగా చంద్రబాబునాయుడు తన రాజకీయం సాగుతున్న రాష్ట్రంతో సంబంధం లేని హైదరాబాదులో మాత్రమే ఎందుకు ఉన్నట్లు? మిలియన్ డాలర్ ప్రశ్న ఇది.

చంద్రబాబునాయుడు ఇదివరలో జగన్ కు హితోపదేశాలు చేస్తూ.. హుదుద్ తుపాను వచ్చినప్పుడు.. తాను ఎంతకాలంపాటు అచ్చంగా విశాఖపట్నంలోనే తిష్టవేసి సహాయక చర్యలను పర్యవేక్షించానో.. మీరు కూడా అలా చేయండం అంటూ అనేక సూచనలు చేశారు. నిజానికి అప్పట్లో- చంద్రబాబు నిత్యం విశాఖలోనే తిష్టవేసి, అధికారులతో రివ్యూల మీద రివ్యూలు పెడుతుండడం వల్ల.. పనులు మందగిస్తున్నాయనే విమర్శలు కూడా బాగా వినిపించాయి. అయినాసరే, హుదుద్ సాయాల గురించి అంతగా డబ్బా కొట్టుకున్న బాబు.. ఇప్పుడు కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా తనకు సంబంధంలేని వ్యవహారంలాగా చూస్తున్నారు ఎందుకు?

జనతా కర్ఫ్యూ విధించిన రోజున  చంద్రబాబునాయుడు హైదరాబాదులో ఎంచక్కా మనవడితో ఆడుకుంటూ గడిపారు. ఆ తర్వాతి రోజునుంచి లాక్ డౌన్ ప్రకటించారు. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రం శ్రద్ధ ఉన్నా.. అదే రోజున విజయవాడకు వెళ్లిపోయి ఉండొచ్చు. అచ్చంగా రాష్ట్రంలోనే తాను ఉంటూ.. జరుగుతున్న చర్యలను, జాగ్రత్తలను పర్యవేక్షిస్తూ ఉండొచ్చు. తెలుగుదేశం కార్యకర్తలకు ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, సోషల్ డిస్టెన్సింగ్ ఆవశ్యకతను తెలియజెప్పడానికి అవసరమైన చైతన్యం కలిగించేలా ప్రేరణ ఇస్తూ ఉండవచ్చు. ఆ పనులన్నీ కూడా ఇంట్లో ఉండి చేయాల్సినవే కదా.. నేను బెజవాడలో ఉంటే ఏంటి, హైదరాబాదులో ఉంటే ఏంటి? అని చంద్రబాబు వాదింవచ్చు. కానీ.. తమ రాష్ట్రంలోనే తమ నాయకుడు ఉన్నాడనే భరోసా ప్రజలకు ఉంటుంది.

కానీ చంద్రబాబు అలా చేయకుండా హైదరాబాదులో ఉండిపోయి కేవలం ట్వీట్లు, సీఎంకు రాసే లెటర్లతో ప్రతిరోజూ మీడియాలో మైలేజీ కోరుకుంటున్నారు. ఈ పదిరోజుల్లో ఒకరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. రాష్ట్రాన్ని ఇంతగా గాలికొదిలేసి.. ఆయన హైదరాబాదుకే పరిమితం కావడం వెనుక ఆంతర్యం ఏంటో మరి!

నీ ఆస్థి ఐశ్వర్యం ఆంధ్ర ప్రజల బిక్ష అని మర్చిపోకు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?