cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఆ ‘రహస్యం’ బయటపడటంతోనే పవన్ అలా?

ఆ ‘రహస్యం’ బయటపడటంతోనే పవన్ అలా?

ఉన్నట్టుండి తన సెక్యూరిటీ సిబ్బందిని పవన్ కల్యాన్ వెనక్కు పంపించాడు. కొన్నాళ్ల కిందట తనకు సెక్యూరిటీ కావాలని అడిగిందీ పవన్ కల్యాణే, ఇప్పుడు వాళ్లను వెనక్కు పంపిందీ పవన్ కల్యాణే, ఆయన ఇష్టం అనుకోండి. సెక్యూరిటీని పెట్టుకోవడం వెనక్కు పంపించడం పవన్ చేతిలోని అంశమే. ఇక ఈ అంశం గురించి వస్తున్న వివరణ భలే ఉంది.

తన పార్టీకి సంబంధించిన రహస్యాలను సెక్యూరిటీ సిబ్బంది లీక్ చేస్తున్నారని, వారిని ప్రభుత్వమే ఏజెంట్లుగా నియమించిందని, అందుకే పవన్ కల్యాణ్ వారిని వెనక్కు పంపించినట్టుగా చెబుతున్నారు. ఇంతకీ ఏం లీక్ అయ్యింది? పవన్ కు ఇంత కోపం ఎందుకు వచ్చింది? ఇంతకీ ఆ ‘రహస్యం’ ఏమిటి? అంటే అది కమ్యూనిస్టు పార్టీ నేతలతో ముడిపడిన వ్యవహారం అని తెలుస్తోంది.

ఇటీవల ఏపీకి చెందిన ఇద్దరు కమ్యూనిస్టు పార్టీల ముఖ్య నేతలు పవన్‌ను కలవడానికి వెళ్లారట. వాళ్లు ఎర్రన్నలు కూడా వేరే పని ఉండదు. అందులోనూ పవన్ కల్యాణ్‌ను చూసే సరికి వారికి కొత్త ఉత్సాహం వచ్చింది. పవన్‌ బొమ్మ చూపించుకుని ఏవో రెండు మూడు సీట్లైనా పొందాలి అనేది వారి దురాశ. ఆ దురాశ మేరకు వాళ్లు ఈ మధ్య అనునిత్యం పవన్ కల్యాణ్ వెంట కనిపిస్తున్నారు. పవన్‌కు అసిస్టెంట్లులా మారిపోయింది వీరి పరిస్థితి. పవన్ తరఫున వీళ్లే ప్రకటనలు చేస్తున్నారు.

ఈ ఉత్సాహంతోనే పవన్ ఇంటికి వెళ్లారట ఈ ఎర్రన్నలిద్దరూ. వీళ్లు ఒకేసారి వచ్చే ఎన్నికల్లో సీట్ల బేరం వరకూ మాట్లాడేసే ఉత్సాహంతో ఉన్నారు. అయితే అక్కడ ఉన్నది పవన్ కల్యాణ్. జనసేన అధిపతికి ఇప్పటికీ రాజకీయాలు అంత సీరియస్ ఏమీ కాదు. ఎలాగూ అధికారం చేతికి రాదు అనే క్లారిటీ పవన్‌కు ఉంది. ఆ మాత్రం దానికి 24ఇంటూ 7పని చేసే ఆసక్తి పవన్‌కు లేదు.

ఇలాంటి మూడ్‌లో ఉన్న పవన్‌ను కలవడానికి వెళ్లిన ఎర్రన్నలకు గట్టిషాకే తగిలింది. వీళ్లను పవన్ ఇంటి వద్ద ఎవరూ పట్టించుకోలేదట. పవన్‌ను కలవడానికి వచ్చాం అన్నా, వీళ్లను అనామకుల్లా ట్రీట్ చేశారట. చాలా సేపు వేచి చూసినా పవన్ దర్శనం వీరికి దక్కలేదని తెలుస్తోంది. వీళ్లు అక్కడకు వెళ్లడం, పవన్ కోసం చాలా సేపు వేచి ఉండటం, వీళ్లకు ఎలాంటి సమాధానం రాకపోవడం.. ఇదంతా మీడియాకు అందింది. దీంతో కొన్ని చానళ్లు ఈ మ్యాటర్‌ను ప్రసారం చేయడం మొదలైంది. దీంతో పవన్ అలర్ట్ అయ్యి, ఈ ఎర్రన్నలను లోపలకు పిలుచుకుని మాట్లాడాడు అట.

ఈ వ్యవహారంపై వపన్ కల్యాణ్‌ ఫైర్ అయ్యాడని తెలుస్తోంది. ఇంటి లోపలి వ్యవహారం మీడియాకు ఎలా చేరింది? అని మండిపడ్డాడట. అనుమానం సెక్యూరిటీ సిబ్బంది మీద కలగడంతో, వారి ద్వారానే ఈ విషయం మీడియా వరకూ వెళ్లిందనే లెక్కతో, రెండు రోజుల్లోనే వారిని తిప్పి పంపేయడం జరిగిందని తెలుస్తోంది. పవన్ సెక్యూరిటీ సిబ్బందిని బయటకు పంపించడం వెనుక ఉన్న కథ ఇదేనని కమ్యూనిస్టు పార్టీల వాళ్ల ద్వారానే ఈ మ్యాటర్ లీక్ అవుతోంది!