cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఎదురుతిరిగిన 'తిరుమల'

ఎదురుతిరిగిన 'తిరుమల'

కాలం చిత్రంగా వుంటుంది. ఒక్కోసారి మనం చేసిన పని మనకే ఎదురువస్తుంది. మనఖర్మ ఏమిటంటే, కులాల కుంపట్లు పెట్టుకుని, అడ్డగోలు ప్రచారం చేస్తుండడటంతో నిజాలు జనాలకు తెలియకుండా పోవడం. బ్రాహ్మణులకు ముఖ్యంగా దేవాలయాలకు, పూజారులకు మేలు ఏమైనా జరిగింది అంటే అది వైఎస్ హయాంలోనే తప్ప బాబు హయాంలో కాదు. కానీ ఆ విషయం ఏనాడూ ఏ మీడియా కూడా సవివరంగా చెప్పింది లేదు.

నానా యాగీ చేసారు వైఎస్ ఏడు కొండలను కబ్జా చేసేస్తున్నాడని. కానీ ఆ ఏడు కొండల విషయంలో సరైన జీవో ఇచ్చింది వైఎస్ ప్రభుత్వమే. చిలుకూరు ఆలయంపై చంద్రబాబు దాష్టీకం ఎలాంటిదో పూజారి సౌందర్యరాజన్ ఏళ్ల తరబడి, గంటల కొద్దీ మైకులో ఆలయంలో జనాలకు చెప్పి చెప్పి అలసిపోయారు. ఆఖరికి వైఎస్ ఆ సమస్యను పరిష్కరించారు. గత ఎన్నికలప్పుడు వైఎస్ జగన్ ఏడుకొండల మీద చెప్పులు వేసుకున్నట్లు తెగ పబ్లిసిటీ చేసారు. నిజంగా వేసుకున్నారా? లేదా? ఎక్కడ? సందర్భం ఏమిటి? ఏమీ తెలియదు. ప్రచారం జరిగిపోయింది.

కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గాలు ఏమంటున్నాయి? మతాన్ని వాడుకోవడం అన్నది భాజపా తరువాతే అంటున్నాయి. మరి గత ఎన్నికలప్పుడు తిరుపతిని వాడుకున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ కాదా? అంటే తమ దాకా వచ్చేసరికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? రమణ దీక్షితులు వ్యవహారం నేషనల్ మీడియాకు ఎక్కింది. గులాబీ వజ్రం, కృష్ణదేవరాయలు సమర్పించిన నగల వ్యవహారంపై జాతీయ మీడియా దృష్టి పెట్టింది.

దీంతో చంద్రబాబు అండ్ కోకు గాభరా పుడుతోంది. అసలు టీటీడీ చానెల్ లో రాఘవేంధ్రరావు, కీరవాణిలు తప్ప వేరెవరూ లేకుండా చేసారని విమర్శలు వున్నాయి. అందుకు గాను లక్షలు లక్షలు బిల్లులు చెల్లిస్తున్నారని విమర్శలు వున్నాయి. నిజమెంతో తెలియదు కానీ, ఇప్పుడు ఆ చానెల్ పై పెత్తనం మొత్తం రాఘవేంద్రరావుకు కట్టబెట్టారు. తెలుగు మీడియా వీలయినంత టోన్ డౌన్ చేయాలని చూస్తోంది. మరోపక్క రమణ దీక్షితులుపై బురద జల్లాలని చూస్తోంది. కానీ ఫలితం కనిపించడం లేదు. రమణ దీక్షితులు లేవనెత్తిన సందేహాలు సమాధానాలు మాత్రం ఇవ్వడం లేదు.

నిధులు దుర్వినియోగం కావడం లేదు, ప్రభుత్వ ఉద్యోగిగా వుంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? విమర్శిస్తారా? అంటూ వేరే యాంగిల్ లో వస్తున్నారు. మరి మొన్నటికి మొన్న అశోక్ బాబు ప్రభుత్వ ఉద్యోగిగా వుంటూ బెంగళూరు రాజకీయ ప్రచారం కోసం ఎందుకు వెళ్లారో? ఎవరు పంపారో? ఏమైనా ఏ తిరుపతిని 2014లో తెలుగుదేశం పార్టీ వాడుకుందో? ఆ తిరుపతి-తిరుమలనే 2019లో బాబుకు ఎదురు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.