cloudfront

Advertisement


Home > Politics - Gossip

కొత్తగా చేరి వచ్చే వాళ్లకే టీడీపీ టికెట్లు!

కొత్తగా చేరి వచ్చే వాళ్లకే టీడీపీ టికెట్లు!

చేరతారో లేదో అనే గందరగోళంలో ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి తెలుగుదేశం టికెట్ ఎదురుచూస్తోంది. ఆయన వచ్చి చేరితేచాలు.. కర్నూలు ఎంపీ టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు రెడీగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. అంతేకాదు.. కోట్ల కుటుంబానికి, అనుచరులకు మరో రెండు టికెట్లు ఖరారేనట. తెలుగుదేశం పార్టీలో దశాబ్దాలుగా ఉన్నవారు ఆశిస్తున్న డోన్ సీటును కూడా బాబు కోట్లకు ఇవ్వడానికి రెడీనట. వచ్చి చేరితే చాలు అనేది లెక్క!

కేవలం కర్నూలు వ్యవహారమే కాదు.. నెల్లూరు ఎంపీ టికెట్ కూడా చేరి వచ్చిన వ్యక్తికే ఖరారు అవుతుండటం గమనార్హం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికే బాబు నెల్లూరు ఎంపీ టికెట్ ను ఖరారు చేశారని తెలుస్తోంది. పార్టీలో బోలెడంత మంది సీనియర్లున్నారు. పేరున్న వాళ్లున్నారు. అయితే వారిని కాదని.. బాబు వైసీపీ నుంచి వచ్చిన బొమ్మిరెడ్డికి ప్రాధాన్యతను ఇవ్వడం విశేషమే.

ఇక బొమ్మిరెడ్డి ట్రాక్ రికార్డు చూస్తే.. ఈయన గత ఏడాదిలో వైసీపీకి రాజీనామా చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే టికెట్ ను ఆశించినట్టుగా ఈయన చెప్పుకున్నారప్పుడు. తనకు జగన్ ఆ అవకాశం ఇవ్వలేదని బయటకు వచ్చినట్టుగా ప్రకటించుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలోకి చేరాకా ఈయన ఆత్మకూరు సీటు మీద కన్నేశారు. ఆత్మకూరు అసెంబ్లీ టికెట్ అడిగారట. అయితే బాబు అది కుదరదని నెల్లూరు ఎంపీ టికెట్ ఖరారు చేశారట!

అక్కడ వెంకటగిరి ఇవ్వలేని ఇక్కడకు వచ్చి ఆత్మకూరు అడిగిన బొమ్మిరెడ్డికి చివరకు నెల్లూరు ఎంపీ టికెట్ ఖరారు కావడం.. ఈయన నెల్లూరు ఎంపీ సీటుకు ఎంత బలమైన అభ్యర్థో అర్థమయ్యేలా చేస్తోంది. కర్నూలు, నెల్లూరు సీట్లే కాడట.. ఇన్నాళ్లూ నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ వాళ్లను మరింత మందిని చేర్చుకుని బాబు వారికే టికెట్ లు కేటాయించే నియోజకవర్గాలు మరిన్ని ఉన్నాయని సమాచారం!

రాజకీయంలో డబ్బే డబ్బు.. ఇదే రాజకీయ సిద్ధాంతం..!

వైఎస్సార్ డైలాగ్స్ పబ్లిక్ చెప్తే.. ఆ కిక్కే వేరప్పా