cloudfront

Advertisement


Home > Politics - Gossip

వివేక హత్యః టార్గెట్ కడప ఎంపీ సీట్!

వివేక హత్యః టార్గెట్ కడప ఎంపీ సీట్!

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణాలు ఏవి అయినా.. అధికారం అండలేనిది, ముఖ్యుల ఆశీస్సులు లేనిది.. అక్కడ గొడ్డలి పైకి లేచి ఉండదనే మాట కడప స్థానికుల్లో వినిపిస్తూ ఉంది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే తెలుగుదేశం అనుకూల మీడియా చాలా ఇన్వెస్టిగేషన్ చేసింది, ఆ ఇన్వెస్టిగేషన్ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే తప్ప.. అసలు విషయాలను తేల్చడానికి కాదు. అసలు విషయంగా చెప్పబడే అంశం ఏదైనా అది తెలుగుదేశం పార్టీ అనుకూలంగానే ఉంటుంది. అది నిస్సందేహం.

పోలింగ్ తేదీవరకూ ఈ హత్య కేసును తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే సాగుతుంది. ఆ తర్వాత ఎలాగూ కథ వేరేలా ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు ఈ కేసును ఫక్తు రాజకీయానికి వాడుకొంటూ ఉన్నారనే విషయం స్పష్టం అవుతూనే ఉంది. 

అయినా జగన్ మీద అటాక్ జరిగితేనే.. అది జగనే చేయించుకున్నారని గంటలోనే తేల్చిచెప్పిన ప్రభుత్వానికి, ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసును ఎలా కావాలనుకుంటే అలా ట్విస్ట్ చేయడం ఏమాత్రం కష్టంకాదు అనేది జనాలు అనుకుంటున్న మాట.

ఇక ఈ కేసులో తదుపరి కథ అంతా.. టార్గెట్ కడప ఎంపీ సీటుగానే సాగబోతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ‘కడప ఎంపీ సీటును టార్గెట్..’ అని తెలుగుదేశం పార్టీలోని ఒకనేత బహిరంగ సవాల్ విసరడం దగ్గరే ఈ కథ మొదలైందని.. ఇక కథ అంతా అందుకోసమే సాగబోతోందని ఆఫ్ ద రికార్డుగా వారు చెబుతూ ఉన్నారు.  

రాధాకృష్ణ నాతో పెట్టుకోకు నేను ఎదవని కాదు...

సురేఖ వద్ద పవన్ పర్సనల్ లోన్.. కోటి ఏడు లక్షలకు పైగా..