వైకాపా బేధం…తేదేపా లాభం

ముత్యాల ముగ్గు సినిమాలో కాంట్రాక్టర్ రావుగోపాలరావుకు ఓ కాంట్రాక్టు వస్తుంది. అదేమిటంటే ఓ జంటను విడగొట్టాలి. అలా విడిపోయిన జంటలో ఒకరితో ఇంకొరికి ముడి వేయాలి.  Advertisement ఇప్పడు ఇలాంటి కాంట్రాక్టునే తెలుగుదేశం పార్టీతో…

ముత్యాల ముగ్గు సినిమాలో కాంట్రాక్టర్ రావుగోపాలరావుకు ఓ కాంట్రాక్టు వస్తుంది. అదేమిటంటే ఓ జంటను విడగొట్టాలి. అలా విడిపోయిన జంటలో ఒకరితో ఇంకొరికి ముడి వేయాలి. 

ఇప్పడు ఇలాంటి కాంట్రాక్టునే తెలుగుదేశం పార్టీతో సామాజిక బంధాలు పెనవేసుకుని అను'కుల' మీడియా అని ముద్రపడిన పార్టీ చేస్తున్నట్లుగా వుంది. వైకాపా-భాజపా బంధాలు విడగొట్టాలి. ఆపై భాజపా-తేదేపా కు ముడి వేయాలి. ఇదీ కాంట్రాక్ట్.

హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈ కార్యక్రమం ఊపందుకుంది. ఫలితాలు వెలువడిన నాడే హైదరాబాద్ లో జగన్ అంతర్గత ఆదేశాల మేరకు సెటిలర్లు అంతా తెరాసకు అనుకూలంగా ఓటేసారని ఓ వార్త ముందుగా వండేసారు.  

ఆధునిక హైదరాబాద్ నిర్మాత చంద్రబాబే అని టముకేసేదీ వారే. అలా టముకువేసినా, సెటిలర్లు అంతా వైకాపా వారే, వారంతా తెరాసకే ఓటేసారని గోలచేసేది వారే. 

హైదరాబాద్ ఎన్నికల్లో గుప్పెడు అక్షింతలన్ని ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకు తెచ్చుకోలేకపోయిందో? దానికి ఎవరి అంతర్గత ఆదేశాలు వున్నాయో అన్నది మాత్రం ఆలోచించరు. రాయరు. అది వేరే సంగతి.

సరే, అది అలా వుంచితే మళ్లీ కొత్తగా ఇంకో కథనం పుట్టించడం ప్రారంభించారు. జగన్ సోదరి షర్మిలను తీసుకువచ్చి తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించి (బాబుగారు తన బావమరిది కూతురుకు తెలంగాణ పార్టీ బాధ్యతలు అందించినట్లుగా) మళ్లీ వైకాపాను రివైవ్ చేస్తారని, ఇదంతా రెడ్ల ఓట్లు చీల్చడం కోసం, అది కూడా తెరాసను కాపాడడం కోసం అంటూ ఆ కథనంలో చెప్పుకున్నారు.

ఈ కథనం లాజిక్ ల సంగతి అలా వుంచి, ఇది ఇప్పుడు అర్జంట్ గా ఎందుకు వండడం అంటే, ఇది చదివి భాజపా జనాలకు కోపం వచ్చేయాలి. సర్రున వైకాపా మీద విరుచుకుపడిపోవాలి. ఆపై భాజపా-వైకాపా సంబంధాలు చెడిపోవాలి. వీలయితే మోడీకి బోలెడు కోపం వచ్చేసి జగన్ కేసులు త్వరగా తెవిల్చి, జైల్లోకి తోసేయాలి. 

అప్పుడు మళ్లీ మనం, మన వర్గం, మన పార్టీ, మన బాబు గారు అధికారంలోకి వచ్చేయచ్చు. లేదూ మరీ అంతలా జరగకపోయినా, కనీసం వైకాపాకు భాజపా దూరం జరిగి తేదేపాకు దగ్గర కావాలి. అలా అయినా కొంత బెటరే. 

సరే ఇంతకీ ఆ కథనంలో లాజిక్ ను చూద్దాం. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు వుంది. వైకాపా అంటే అభిమానం వున్నవారు తెలంగాణలో వుండి వుండొచ్చు. వారు జగన్ అంతర్గత సందేశాన్ని శిరసా వహిస్తారని అనుకోవచ్చు. అందులో తప్పులేదు. ఆ మీడియా లెక్కల ప్రకారమే అంతర్గత సందేశాలతో భాజపాకు వ్యతిరేకంగా ఓట్లు వేసినపుడు మళ్లీ పార్టీ ఎందుకు? పైకి హడావుడి లేకుండా పనైపోతున్నపుడు హడావుడి ఎందుకు? 

పైగా ఇలా కథనం అందించే బదులు మరోలా కూడా కథనం రాసి భాజపాను బెదిరించే ప్రయత్నం చేసి లొంగదీసుకోవచ్చుగా. బాలకృష్ణనో, లోకేష్ బాబునో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ను చేస్తారని, కింద నుంచి పార్టీని రివైవ్ చేసి, బలమైన ప్రతిపక్షంగా తయారుచేసి, భాజపాకు ఝలక్ ఇవ్వబోతున్నారని రాయచ్చుగా. 

అప్పుడు భాజపా భయపడిపోయి, ఆంధ్రలో పొత్తు పెట్టేసుకుందాం, అంత పని చేయమాకండి అనేస్తుందేమో? అబ్బే మళ్లీ అలా రాయరు. అలా రాస్తే భాజపా మరింత దూరం జరిగిపోయి, మరింత పంతం పెంచేసుకుంటుందని భయం. పైగా వైకాపా మీద రాళ్లేయడం అంటే మహా సరదా..సులువు కూడా.

కానీ ఈ 1980 కాలపు చచ్చు పుచ్చు ఐడియాలతో ముందుకు వెళ్లే మీడియాకు తెలియంది ఏమిటంటే, జనాలు ఇప్పుడు బాగా తెలివి మీరారు. ఓ వార్త రాస్తే దాని వెనుక ఏముండి వుంటుందని ముందుగానే పసిగట్టేస్తున్నారు. ఎంత ఊదరగొట్టినా నమ్మడం లేదు. నవ హైదరాబాద్ నిర్మాత చంద్రబాబే అని  ఎంత టముకువేసినా నమ్మనట్లుగానే  అన్నమాట. 

జనాలకే ఇంత తెలియగా లేనిది , రాజకీయాలు ఔపాసన పట్టేసిన భాజపా నాయకులకు, లీడర్లకు తెలియనిదా ఈ వార్తల వెనుక ఏముందో? అయినా తమ రాళ్లు తాము వేస్తూనే వుంటారు. ఏదో ఒకటి తగలకపోతుందా అనే ఫ్రస్టేషన్ లో. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే తప్ప ఈ రాళ్లేసే కార్యక్రమం ఆగదు. 

పవర్ స్టార్ పేరెత్తగానే