Advertisement

Advertisement


Home > Politics - Gossip

వైకాపాలో మోగుతున్న 'గంటా'

వైకాపాలో మోగుతున్న 'గంటా'

విశాఖలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా నాయకులు లేని పార్టీగా మార్చి దెబ్బతీయాలన్నది వైకాపాలోని కొందరి వ్యూహం. అందుకోసం గంటా శ్రీనివాసరావును పార్టీలోకి రప్పించాలన్నది ఆలోచన.

గంటా వస్తే ఇక పార్టీలో తమ ఆధిపత్యం లేదా గుర్తింపు లేదా మనుగడకు సమస్య అని కొందరి ఆలోచన. అందుకోసం ఎలాగైనా అన్ని విధాలా అడ్డం పడాలన్నది వ్యూహం.

ఈ వ్యూహ ప్రతి వ్యూహాల  మధ్య వైకాపా విశాఖ తీర రాజకీయం తెరవెనుక రంజుగా మారుతోంది. చిత్రమేమిటంటే గంటా కీలక నేతగా వున్న తెలుగుదేశం పార్టీలో ఏ హడావుడి లేదు. అక్కడ ఆయనను ఆపే ప్రయత్నమూ జరగుతున్నట్లు కనిపించడం లేదు. 

వైకాపాలోకి గంటా రావడం అన్నది మంత్రి అవంతి కి, అనకాపల్లి ఎమ్మెల్యే అమరనాథ్ కు సుతరామూ ఇష్టం లేదు. అవంతి గతంలో గంటాతో సరిపడకే పార్టీ వదిలి వైకాపాకు వచ్చారు. పార్టీ మారినా సవతిపోరు తీరదన్నట్లు వుంది ఇప్పుడు. అలాగే అమరనాధ్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. గంటా వస్తే మంత్రి పదవి మాట దేవుడెరుగు, మాట చెల్లడం కూడా కష్టం అవుతుంది. పైగా అనకాపల్లి నియోజకవర్గం అంటే గంటాకు పట్టు వుంచుకున్న నియోజకవర్గం.

అందువల్ల ఈ ఇద్దరూ గంటా రాకను బలంగా వ్యతిరేకిస్తున్నారు. అధిష్టాన నిర్ణయం కాబట్టి మరీ తెగేదాకా లాగడం లేదు కానీ అవసరం అయితే తెగేదాకా లాగడం తప్పదు అనే సంకేతాలను సోషల్ మీడియా ద్వారా పంపిస్తున్నారు. అవసరం అయితే ఎమ్మెల్యే పదవి వదులుకుంటా కానీ గంటా రాకను అంగీకరించను అని అమర్ నాథ్ అంటున్నారంటూ సోషల్ మీడియాలో అక్కడక్కడ వార్తలు కనిపిస్తున్నాయి. కానీ అలా అని వుంటారా? అన్నది అనుమానమే.

అవంతి అయితే గంటా రాకను బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. నిజానికి ఇప్పుడు పార్టీ మారడానికి గంటాకు మాంచి టైమ్. ద్రోణంరాజు శ్రీనివాస్ మృతితో వుడా చైర్మన్ పోస్ట్ ఖాళీ అయింది. బంగారు బాతుగుడ్డులాంటి పదవి. అది బేరం పెట్టుకుని గంటా సులువుగా పార్టీ మారిపోవచ్చు.

ఆ సంగతి గమనించి వైకాపా లో వున్న జనాలు మరింత గట్టిగా లోలోపల అసంతృప్తి స్వరం వినిపించేలా ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్ర వైకాపాలో గంట గట్టిగానే మోగుతోంది.

చుండూరు జగన్ ఎకౌంటులో ఉందా? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?