అందరూ అమాయకులే.. టీఆర్ఎస్ సర్వే ఫలితం

గ్రేటర్ పరిథిలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది కార్పొరేటర్లపై వ్యతిరేకత ఉందనేది బహిరంగ రహస్యం. హైదరాబాద్ కు వచ్చిన వరదలతో వాళ్లపై ఉన్న వ్యతిరేకత ప్రత్యక్షంగా బయటపడింది. Advertisement చాలా ప్రాంతాల్లో ప్రజలు, అధికార…

గ్రేటర్ పరిథిలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది కార్పొరేటర్లపై వ్యతిరేకత ఉందనేది బహిరంగ రహస్యం. హైదరాబాద్ కు వచ్చిన వరదలతో వాళ్లపై ఉన్న వ్యతిరేకత ప్రత్యక్షంగా బయటపడింది.

చాలా ప్రాంతాల్లో ప్రజలు, అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లను లోపలకు రానివ్వలేదు. ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు టీఆర్ఎస్ మాత్రం గ్రేటర్ ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థులకే తిరిగి టిక్కెట్లు ఇవ్వాలని దాదాపు నిర్ణయించింది. దీనికి ఆ పార్టీ చెప్పే లాజిక్ కూడా భలే గమ్మత్తుగా ఉంది.

అంతర్గత సర్వే ఆధారంగా ఈసారి ఎన్నికలకు టిక్కెట్లు కేటాయించాలని టీఆర్ఎస్ చాన్నాళ్ల కిందటే నిర్ణయించింది. చెప్పినట్టుగానే సర్వే నిర్వహించి, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న కార్పొరేటర్ల లిస్ట్ తయారుచేసింది. 

సరిగ్గా ఇక్కడే విచిత్రమైన నిర్ణయం తీసుకుంది టీఆర్ఎస్. అలా వ్యతిరేకత ఎదుర్కొంటున్న కార్పొరేటర్లకు మరో ఛాన్స్ ఇచ్చారట. వాళ్లు ప్రజల్లో కలియదిరిగి మళ్లీ మద్దతు సంపాదించుకున్నారట. తాజాగా మరోసారి నిర్వహించిన సర్వేలో ప్రజావ్యతిరేకత ఉన్న కార్పొరేటర్లకు కూడా పాజిటివ్ వేవ్ వచ్చిందట.

సో.. దాదాపు సిట్టింగ్ కార్పొరేటర్లందరికీ టిక్కెట్లు ఇవ్వాలని టీఆర్ఎస్ ఓ నిర్ణయానికొచ్చింది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన ముగ్గురు కార్పొరేటర్లకు మాత్రం 'అసమర్థత' పేరు చెప్పి టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలుస్తోంది.

గత గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఏకంగా 99 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఆ ఎన్నికల్లో ఆంధ్రాప్రజలు కూడా భారీ ఎత్తున టీఆర్ఎస్ కు ఓట్లు వేయడం విశేషం. ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి మరో ముగ్గురు వచ్చి చేరారు. సర్వే పేరిట టీఆర్ఎస్ తీసుకున్న తాజా నిర్ణయంతో, ఈసారి ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చూడాలి. 

వరద సహాయక కార్యక్రమాల్లో అక్రమాలు, కార్పొరేటర్ల అవినీతి, గ్రేటర్ శివార్లలో పేదలకు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందకపోవడం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లాంటి అంశాలు ఈసారి టీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారబోతున్నాయి. 

విజన్ 2020 అంటే అర్థం చేసుకోలేకపోయాం