బీజేపీకి కలిసొచ్చిన ఏడాది

ఒకప్పుడు కేవలం రెండే రెండు స్థానాలు గెలుచుకొని పార్లమెంటులో అడుగుపెట్టిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడొక మహాశక్తిగా తయారైంది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శక్తిమంతుడైన ప్రధానమంత్రిగా అవతరించారు. ఇందిగాంధీ తరువాత అత్యంత సమర్ధుడైన…

ఒకప్పుడు కేవలం రెండే రెండు స్థానాలు గెలుచుకొని పార్లమెంటులో అడుగుపెట్టిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడొక మహాశక్తిగా తయారైంది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శక్తిమంతుడైన ప్రధానమంత్రిగా అవతరించారు. ఇందిగాంధీ తరువాత అత్యంత సమర్ధుడైన శక్తిమంతుడైన ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. 

నరేంద్ర మోదీతో పెట్టుకున్న ఏ పార్టీగానీ, ఏ పార్టీ అధినేతగాని రాజకీయంగా మనుగడ సాగించడం కష్టమనే అభిప్రాయం మీడియాలో ఉంది. 2020లో కరోనా కారణంగా ఇతర ప్రపంచ దేశాల్లాగే భారత్ సైతం ఆర్థికంగా దెబ్బ తిన్నది. ఒడిదొడుకులను చవిచూసింది. అయినప్పటికీ బాగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్ కరోనా మహమ్మారిని దీటుగా ఎందుర్కొన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కరోనా వైరస్‌ను, పలు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలను బ్యాలెన్స్ చేసింది బీజేపీ. కరోనాను భారత్ ఎలా ఎదుర్కొన్నదనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ 2020 మాత్రం రాజకీయంగా బీజేపీకి కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది జరిగిన అనేక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 2020 ప్రారంభంలో ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ చతికిలపడినప్పటికీ క్రమంగా పుంజుకొని దాని వ్యతిరేకులను ఆశ్చర్యపరిచింది. 

బీజేపీకి 2020 రాజకీయంగా కలిసొచ్చింది. ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అథ్యధిక సీట్లను గెలుచుకొని తిరిగి అధికారంలోకి వచ్చింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 62 సీట్లలో ఆప్ విజయం సాధించింది. 

2015 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ పరిస్థితి ఫర్వాలేదనిపించింది. 2015లో మూడు సీట్లను మాత్రమే గెలుచుకున్న కమలం పార్టీ మరో ఐదు సీట్లు గెలుచుకొని మొత్తం  సీట్ల వద్ద నిలిచింది. అక్టోబర్‌నవంబర్‌లో బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. 

మొత్తం 243 సీట్లున్న బిహార్ అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 125 సీట్లను సొంతం చేసుకుంది. 15 ఏళ్లలో తొలిసారిగా బీజేపీ జేడీయూ కంటే అత్యధిక సీట్లలో విజయం సాధించింది. అయితే పొత్తు ప్రకారం జేడీయూ నేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పీఠం అలంకరించారు. 

2020లో మొత్తం 74 మంది రాజ్యసభకు వెళ్లారు. వీరిలో 16 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో 12 మంది ఎంపీలుగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో అప్పటికే ఉన్న ఎంపీల సంఖ్యకు మరో 12 మంది తోడవడంతో పెద్దల సభలో ఎన్‌డీఏ మెజారిటీకి చేరువైంది. 

చాలా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు పార్టీలను ఫిరాయించడంతో లేదా ఎమ్మెల్యేల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవల్సింది మధ్యప్రదేశ్ అసెంబ్లీకి 2 సీట్లలో ఉప ఎన్నికలు జరిగాయి. 25 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించడంతో ఆ రాష్ర్టంలో ఉప ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా 19 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఉత్తర ప్రదేశ్‌లో   7 సీట్లలో ఉప ఎన్నికలు జరగ్గా బీజేపీ 6 సీట్లలో విజయం సాధించింది.

గుజరాత్‌లో  స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా కాషాయం పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఈశాన్య  రాష్ర్టం మణిపూర్‌లో 5 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా బీజేపీ అక్కడ పాగా వేసింది. తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నిక దేశం దృష్టిని ఆకర్షించింది. 

టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి మృతి కారణంగా జరిగిన ఈ ఎప ఎన్నిక టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఈ ఉప ఎన్నికను నిలిపిందనే అభిప్రాయం వ్యక్తమైంది. బీజేపీ అభ్యర్థి రఘునందనరావు విజయం సాధించడంతో తెలంగాణలో బీజేపీ బలపడుతోందన్న ప్రచారం జరుగుతోంది. దుబ్బాక తరువాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అధికార టీఆర్‌ఎస్‌కు అడ్డుకట్ట వేయడం విశేషం. 

నాగ్ మేడేపల్లి