బాబు నీచాన్ని బట్టబయలు చేసిన ఐవైఆర్

గీతం విద్యా సంస్థల విషయంలో చంద్రబాబు ఎంత నీఛంగా వ్యవహరించారో.. గీతం సంస్థలకు ప్రభుత్వ భూమి దక్కకపోవడంతో.. కనీసం ప్రభుత్వ సంస్థలకు కూడా ఆ భూమి దక్కకుండా ఎలాంటి కుటిల ప్రయత్నాలు చేశారో ఇప్పుడిప్పుడే…

గీతం విద్యా సంస్థల విషయంలో చంద్రబాబు ఎంత నీఛంగా వ్యవహరించారో.. గీతం సంస్థలకు ప్రభుత్వ భూమి దక్కకపోవడంతో.. కనీసం ప్రభుత్వ సంస్థలకు కూడా ఆ భూమి దక్కకుండా ఎలాంటి కుటిల ప్రయత్నాలు చేశారో ఇప్పుడిప్పుడే బైటపడుతోంది. 

బాబు హయాంలో జరిగిన కేబినెట్ భేటీ విషయాలను అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బైటపెట్టారు.

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. గీతం విద్యాసంస్థలకు 34 ఎకరాల భూమిని కేటాయించాలని సీఎస్ గా ఉన్న తన దగ్గరకు ఫైల్ వచ్చిందని ఐవైఆర్ చెబుతున్నారు. స్వయానా అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా గీతంకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారట, కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు కూడా ఇలాగే ఒత్తిడి తెచ్చినా ఐవైఆర్ వినలేదట. అంతలోనే వివిధ ప్రభుత్వ సంస్థలకు ఆ భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చేశారు.

అయితే ప్రభుత్వ నిర్ణయంపై గీతం కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకుంది. దీంతో తమకు కేటాయించిన స్థలంలో ప్రభుత్వ శాఖలు నిర్మాణాలు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. 

ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం 34ఎకరాల భూమిని ప్రభుత్వ సంస్థలకు దక్కకుండా చేసింది, వాటి కేటాయింపుల్ని రద్దు చేసింది. దీనికి ముఖ్య కారణం చంద్రబాబేనని చెప్పారు ఐవైఆర్. 2017మే 17న జరిగిన కేబినెట్ భేటీలో చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారట.

“గీతం ఎంత గొప్ప సంస్థో మీకు తెలుసు కదా అలాంటి సంస్థ భూమి అడిగితే రాజశేఖర్ రెడ్డి కక్షకట్టి ఆ భూమిని గీతం కు రాకుండా అడ్డుకున్నార”ని చంద్రబాబు కేబినెట్ మీటింగ్ లో ఆరోపించారట. 

అప్పటి మంత్రి గంటా జోక్యం చేసుకుంటూ ఆ వ్యవహారం రాజశేఖర్ రెడ్డి హయాంలో జరగలేదని, కిరణ్ కుమార్ రెడ్డి ఉండగా గీతం అడుగుతున్న భూమిని ప్రభుత్వ సంస్థలకు కేటాయించారని వివరించారట. 

గీతంకు కేటాయించడం సరికాదని కూడా అన్నారట. దీంతో చంద్రబాబు చేసేదేం లేక గీతంకు అప్పగించకపోయినా, కనీసం ప్రభుత్వ సంస్థలకు జరిగిన కేటాయింపులనైనా రద్దుచేద్దామనే ప్రతిపాదన తెచ్చారట.

అలా ఆ ప్రభుత్వ భూమిని మరోసారి వివాదంలోకి నెట్టి, గీతంకు ఫేవర్ చేశారు బాబు. దీంతో కోర్టులో ఆ వ్యవహారం పెండింగ్ లో ఉంది. అయితే ఆ స్థలం కేవలం 34 ఎకరాలు మాత్రమే కాగా.. ఇటీవ ఆర్డీవో విచారణలో మొత్తం 40ఎకరాల 50 సెంట్లు గీతం సంస్థ ఆక్రమించినట్టు తేలింది. 

అంటే.. ఈ మూడేళ్లలోనే గీతం ఆక్రమణలు మరింత పెరిగాయన్నమాట. ఇటీవల ప్రభుత్వం కూల్చివేసిన నిర్మాణాలు కూడా కొత్తగా ఆక్రమించిన స్థలంలో చేపట్టినవే. దీనికి ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేశాయి. కోర్టులో కేసు ఉండగా నిర్మాణాలను కూల్చేశారంటూ రచ్చ చేశాయి.

ఐవైఆర్ నోరు తెరవడంతో.. చంద్రబాబు బాగోతం మరోసారి బైటపడింది. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఆస్తులకు బాధ్యుడిగా ఉంటానని ప్రమాణ స్వీకారం చేసిన బాబు.. ప్రభుత్వ సంస్థలకు చేసిన భూ కేటాయింపుల్ని రద్దు చేసి, గీతం లాంటి ప్రైవేట్ సంస్థకు అనుకూలంగా వ్యవహరించడం ఎంతవరకు న్యాయం అని వైసీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

రాష్ట్ర అవతరణ దినోత్సవం