ఆయన ఏపీకి సీఎం. వైసీపీకి కాదు. ఆ మాటకు వస్తే అయిదు కోట్ల మంది ప్రజానీకానికి ఆయన పాలకుడు. మరి ఆ విధంగా చూస్తే ఆలోచన చేస్తే ఆయన్ని అందరూ గౌరవించాల్సిందే.
మరి వ్యంగ్యంగా అయినా బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు జగన్ అంటే తనకు గౌరవం అంటున్నారు. అందుకే జగన్ తనను జైలులోకి వేయలేదు అని సెటైర్లు వేస్తున్నారు.
నిజానికి ప్రతిపక్షాలు అధికార పక్షం మధ్య శత్రు భావం ఎందుకు ఉండాలి. ప్రత్యర్ధులుగా మాత్రమే ఉండాలి తప్ప మరో విధంగా ఎందుకు దూరం పెంచుకోవాలి అన్నది విశ్లేషకుల మాట.
రాజు గారు సెటైరకల్ గా అన్నా కూడా ఆయనకు సీఎం అంటే గౌరవం లేదని ఎవరైనా అనుకోగలరా. అలాగే ముఖ్యమంత్రికి కూడా ఎవరి మీద అయినా ప్రత్యేకమైన ద్వేషం ఉంటుందా.
కానీ రాజకీయ కక్ష సాధింపు అన్న బ్రహ్మ పదార్ధాన్ని పట్టుకుని వైసీపీ మీద విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక బీజేపీ రాజు గారు అయితే రఘురామను జైలులో ఉంచితే ఏకంగా అనుమానస్థితిలో మరణించేవారు అని చెప్పేస్తున్నారు.
ఆయనను సీఐడీ అధికారులు కొట్టారని కూడా తీర్పు చెప్పేస్తున్నారు. దీని మీద సీబీఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి జగన్ అంటే గౌరవం ఉందని చెబుతూనే సర్కార్ మీద రాజు గారు బురదల జల్లేస్తున్నారు అంటున్నారు వైసీపీ నేతలు.