“ఆంధ్రప్రదేశ్ లో అసలు అభివృద్ధి ఎక్కడుంది. సంక్షేమం పేరిట నిధులన్నింటినీ పప్పు బెల్లాల్లా పంచి పెడుతున్నారు. ఒక్క భారీ పరిశ్రమైనా తీసుకొచ్చారా..? ఒక్క ఐటీ కంపెనీనైనా తీసుకొచ్చారా..? అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ను పదేళ్లు వెనక్కి నెట్టారు.” చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలివి. వీటికి ఎల్లో మీడియా కూడా విపరీత ప్రచారం కల్పస్తోంది. దీంతో కొంతమంది బాబు చేస్తున్న ప్రచారాన్ని, విమర్శల్ని నిజం అని నమ్మే పరిస్థితి వచ్చింది.
అసలు అభివృద్ధి అంటే ఏంటి? ఓ భారీ పరిశ్రమ స్థాపిస్తే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందా? రాష్ట్రానికి ఓ పెద్ద ఐటీ కంపెనీ తీసుకొస్తే అభివృద్ధి జరిగినట్టేనా..? స్వయంగా ముఖ్యమంత్రి జగన్ అడుగుతున్న ప్రశ్నలివి. తన దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటో స్పష్టంగా వివరిస్తున్నారు సీఎం.
“నేను బటన్ నొక్కి నేరుగా డబ్బులిస్తున్నప్పుడు అభివృద్ధి ఎక్కడ జరుగుతుందంటూ నేనంటే గిట్టని వాళ్లు కొందరు అంటున్నారు. అలాంటివాళ్లందరికీ నేను ఒకటే చెబుతున్నాను. గతంలో శిధిలావస్థలో ఉన్న స్కూళ్లను నాడు-నేడు కార్యక్రమంతో రూపురేఖలు మార్చాం. ఇదీ అభివృద్ధి అంటే. అవే స్కూల్స్ లో సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లిష్ మీడియం పెట్టాం. ఇది కాదా అభివృద్ధి.
గ్రామ సచివాలయం పెట్టాం. అక్కడే 10-12 మందికి ఉద్యోగాలిచ్చాం. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నాడు. అవినీతికి తావులేకుండా నేరుగా ఇంటికే సేవలు అందిస్తున్నాం. గ్రామాల్లో ఆర్బీకేలు వచ్చాయి. విలేజ్ క్లినిక్కులు కనిపిస్తాయి. అక్కడే ఉద్యోగాలొచ్చాయి. అంగన్ వాడీ కేంద్రాలు ప్రీ-ప్రైమరీ స్కూల్స్ గా మారాయి. మరికొన్ని రోజుల్లో గ్రామాలకే డిజిటల్ లైబ్రరీలు వస్తున్నాయి.”
ఒకప్పుడు గ్రామాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవాళ్లని, అలాంటి ఆత్మహత్యలు లేకుండా చేయగలిగామని, ఇంతకంటే అభివృద్ధి ఏం కావాలని ప్రతిపక్షాల్ని సూటిగా ప్రశ్నించారు జగన్. 83వేల 600 కోట్ల రూపాయల్ని రైతన్నలకు సహాయంగా అందించామని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు ముఖ్యమంత్రి జగన్.