ప్ర‌భుత్వ ప‌లుకుబ‌డి స‌రిపోలేద‌న్న జ‌గ‌న్‌

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌లుకు బ‌డి ముందు త‌మ ప‌లుకుబ‌డి స‌రిపోవ‌డం లేద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.  Advertisement నంద్యాల ఘ‌ట‌న గురించి మాట్లాడుతున్న సంద‌ర్భంలో జ‌గ‌న్ ఈ మాట‌ల‌న్నారు.…

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌లుకు బ‌డి ముందు త‌మ ప‌లుకుబ‌డి స‌రిపోవ‌డం లేద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

నంద్యాల ఘ‌ట‌న గురించి మాట్లాడుతున్న సంద‌ర్భంలో జ‌గ‌న్ ఈ మాట‌ల‌న్నారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి అబుల్‌క‌లాం జ‌యంతిని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం ఆయ‌న‌కు జ‌గ‌న్ నివాళుల‌ర్పించారు. అబుల్ క‌లాం జ‌యంతి సంద ర్భంగా తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో జాతీయ విద్యా, మైనార్టీ సంక్షేమ దిన వేడుక‌లు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా  జగన్‌ మాట్లాడుతూ ప్రాథమిక విద్య నుంచి వర్సిటీ విద్య వరకు అబుల్‌ కలాం అనేక సంస్కరణలు తీసుకొ చ్చారని ప్ర‌శంసించారు. ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను అబుల్‌ కలాం హయాంలో స్థాపించారని జ‌గ‌న్ గుర్తు చేశారు. 

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ నిరుపేద విద్యార్థులకు మంచి చదువు అందించేలా నాడు-నేడు కార్యక్రమం అమలు చేస్తున్నా మన్నారు. ఇంగ్లీష్ మీడియం అందించేలా మార్పులు చేస్తున్నామన్నారు.

మైనార్టీలపై ట్విట్టర్‌, జూమ్‌ల్లో మాత్రమే చంద్రబాబు ప్రేమ చూపిస్తున్నారని జ‌గ‌న్ విమర్శలుగుప్పించారు. చంద్రబాబు అధికా రంలో ఉన్నప్పుడు మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. 

చంద్రబాబు పాలనలో కేవలం రూ.2500 కోట్లు మాత్రమే మైనార్టీల సంక్షేమానికి కేటాయించారని మండిప‌డ్డారు. అలాగే  నంద్యాల ఘటన బాధాకరమని సీఎం జగన్ అన్నారు. ఆ ఘ‌ట‌న గురించి తన దృష్టికి రాగానే చట్టబద్ధంగా వ్యవహరించాలని ఆదేశాలిచ్చామ‌న్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఆఖ‌రికి తాను త‌ప్పు చేసినా అదే విధంగా న్యాయం ఉంటుంద‌న్నారు. నంద్యాల ఘటనలోనూ పోలీసులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామని అన్నారు. 

టీడీపీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న రామచంద్రరావు నిందితుల తరపున బెయిల్ పిటిషన్ వేశారన్నారు. న్యాయస్థానంలో నిందితులకు బెయిల్‌ కూడా మంజూరైందని, బెయిల్ రద్దు చేయాలని తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరామ‌న్నారు.  చంద్ర‌బాబు ప‌లుకుబ‌డి ముందు త‌మ ప‌లుకుబ‌డి స‌రిపోవ‌డం లేద‌ని సీఎం న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఎంతో ఆవేద‌న‌తో ఈ మాట‌లు అనాల్సి వ‌స్తోంద‌ని ఆయ‌న ముక్తాయింపు ఇచ్చారు.