జనసేన-భాజపా సమావేశం

హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కోసం జనసేన చివరాఖరి యత్నాలు చేస్తోంది. ఎలాగైనా భాజపాను ఒప్పించి కాసిన్ని సీట్లు అయినా తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు.…

హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కోసం జనసేన చివరాఖరి యత్నాలు చేస్తోంది. ఎలాగైనా భాజపాను ఒప్పించి కాసిన్ని సీట్లు అయినా తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు.

ఈ రోజు సాయంత్రం 4తో నామినేషన్ గడువు ముగుస్తుంది. కానీ ఇప్పుడు ఇంకా సమావేశం నడుస్తోంది.నాదెండ్ల మనోహర్ నివాసంలో పవన్ కళ్యాణ్ తో పాటు భాజపా నాయకులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమావేశం అయ్యారు.

చర్చలు సాగుతున్నాయి. కానీ ఈ ఆఖరి నిమిషంలో చర్చలు సాగించి ఏం ఉపయోగమో? అభ్యర్థులను ప్రకటించడానికి, నామినేషన్ కు ఎక్కడ అవకాశం వుందో వారికే తెలియాలి. 

ఇదంతా చూస్తుంటే జనసేన తన పరువు కాపాడుకోవానికి కిందా మీదా పడుతున్నట్లు కనిపిస్తోంది. నిన్నటికి నిన్న కొద్ది సేపట్లో జాబితా ప్రకటన అంటూ ఓ విడియో వదిలారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రకటన రాలేదు.

ఇప్పుడు ఈ సమావేశం మొదలైంది. ఆఖరికి కొంతమంది భాజపా అభ్యర్థులకే జనసేన బి ఫారమ్ లు ఇచ్చి, జనసేన పోటీ లో వుందీ అని అనిపిస్తారేమో?

బిగ్ బాస్ ఓటింగ్ అంతా ఫేక్ అని తెలుసు