తాము అధికారంలోకి వస్తే.. బూట్లు నాకించుకునే పోలీసులను నియమించుకుంటాను.. అంటూ చంద్రబాబు నాయుడు ముందున ప్రతినబూనిన జేసీ దివాకర్ రెడ్డి ఆ వ్యవహారంలో అరెస్టు అయ్యారు. పోలీసుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం పై ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు పోలీసులు తమపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని, తాము అధికారంలోకి వస్తే.. పోలీసుల చేత బూట్లు నాకించుకుంటానంటూ జేసీ రెచ్చిపోయారు.
ఒక మాజీ ప్రజాప్రతినిధి అయిన జేసీ ఇలా మాట్లాడారు. దీంతో కేసులు తప్పలేదు. ఆ కేసుల్లో దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే జామీను మీద వెంటనే దివాకర్ రెడ్డి విడుదల అయ్యారు. అయితే తన అరెస్టును దివాకర్ రెడ్డి ఖండించుకున్నారు. తను చేసిన వ్యాఖ్యలు చాలా చిన్న విషయాలు అని దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
అంత చిన్న విషయానికే అరెస్టు చేస్తారా.. అంటూ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. అనుచితంగా మాట్లాడమే కాకుండా, ఇలా తన తీరును జేసీ మళ్లీ సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. అధికారంలో ఉన్నప్పుడు జేసీ ఇలానే అడ్డగోలుగా మాట్లాడారు. అయితే అప్పుడు అధికారం అండ ఉండేది, ఇప్పుడు అది లేకపోవడంతో జేసీ అరెస్టు కావాల్సి వచ్చింది.