ఆంధ్రప్రదేశ్ ఎకానామిక్ డెవలప్ మెంట్ బోర్డు.. ఇది పేరుకు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించినది అయినా దీన్ని ఒక కులానికి సంబంధించిన సంస్థగా మార్చేశారు ఒక ఐఆర్ఎస్ అధికారి. ఇటీవలే సస్పెండ్ అయిన జాస్తీ కృష్ణ కిషోర్ లీలలు ఇలా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. తన కులస్తులనూ, అందులోనూ తన బంధువులను.. మొత్తం కన్సల్టెంట్స్ గా నియమించుకుంటూ వస్తూ.. ఆయన ఏపీఈడీబీ చైర్మన్ గా పూర్తి పక్షపాతంతో వ్యవహరించిన వైనం బయటకు వస్తోంది. అందుకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చాయి.
జాస్తీ కృష్ణ కిషోర్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఏపీఈడీబీకి మొత్తం ఇరవై మంది కన్సల్టెంట్ల నియామకం జరిగింది. అందులో పద్నాలుగు మంది కమ్మ కులస్తులు ఉన్నారంటే పరిస్థితిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఏరికోరి తన కులస్తులనే ఆ ఐఏఎస్ అధికారి.. ఈ సంస్థకు కన్సల్టెంట్లుగా నియమించినట్టుగా తెలుస్తోంది.
మరో విషయం ఏమిటంటే..ఆ కన్సల్టెంట్లు మరెవరో కాదు, సదరు అధికారి బంధుగణం, స్నేహితులు! జాస్తీ కృష్ణ కిషోర్ తన క్లాస్ మేట్లను, ఫ్రెండ్స్ ను, తన బంధు గణాన్ని ఒక వైపు నియమించుకుంటూ వచ్చారు. మరోవైపు చంద్రబాబు నాయుడు, ఆయన భార్య రెఫరెన్స్ లతో కూడా కొన్ని నియామకాలు జరిగాయని సమాచారం. మొత్తం కమ్మ బ్యాచ్ నూ అలా కన్సల్టెంట్ లు గా నియమించి.. అడ్డంగా దోపిడీకి ప్రభుత్వ అధికారిగా జాస్తి కృష్ణ కిషోర్ భాగస్వామి అయినట్టుగా తెలుస్తోంది.
ఇరవై మందిలో పద్నాలుగు మంది కమ్మ వాళ్లు. మిగిలిన ఆరు మంది మాత్రం వేరే కులస్తులే. అయితే వారేమీ సామాన్యులు కాదు. చంద్రబాబు నాయుడి కేబినెట్లో మంత్రులు, కీలక నేతల సిఫార్సులతో మాత్రమే వారందరికీ అవకాశాలు దక్కాయి.
ఇటీవలే జాస్తి కృష్ణ కిషోర్ ను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఆయన సస్పెండ్ అయ్యారు. అయితే ఆ సస్పెన్షన్ ను చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు. ఆ అధికారికి చంద్రబాబు నాయుడు వంత పాడారు.