కంగ‌నా చేతిలో జింతాక చితాచితా!

కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీని బాలీవుడ్ వివాదాస్ప‌ద న‌టి ఖంగు తినిపించింది. ఇంత వ‌ర‌కూ కేంద్రంలో మోడీ స‌ర్కార్ ఏం చేసినా… వెన‌కేసుకొచ్చిన బాలీవుడ్ స్టార్ కంగ‌నా ర‌నౌత్‌, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. మోడీ…

కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీని బాలీవుడ్ వివాదాస్ప‌ద న‌టి ఖంగు తినిపించింది. ఇంత వ‌ర‌కూ కేంద్రంలో మోడీ స‌ర్కార్ ఏం చేసినా… వెన‌కేసుకొచ్చిన బాలీవుడ్ స్టార్ కంగ‌నా ర‌నౌత్‌, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. మోడీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పారు. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవ‌డంపై ఆమె మండిప‌డ్డారు.

వ్య‌వసాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవ‌డంపై దేశ వ్యాప్తంగా సానుకూల స్పంద‌న‌లు వెల్లువెత్తుతున్న త‌రుణంలో అందుకు విరుద్ధంగా కంగ‌నా త‌న‌దైన స్టైల్‌లో విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం గ‌మ‌నార్హం. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన ప్ర‌ధాని మోడీపై ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రైతుల‌ పోరాటాల శక్తి నిరూపించిన ఫలితమిది అంటూ నెటిజన్‌ పోస్ట్‌ను కంగనా షేర్ చేస్తూ త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారామె. ఇది చాలా విచారకరం, అవమానం అని నిష్టూర‌మాడారు. పూర్తిగా అన్యాయం అని కంగ‌నా ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  

పార్లమెంటులో ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధి పోరాటం చేస్తున్న వ్యక్తులు చట్టాలు చేయడం ప్రారంభించినట్లయితే, ఇది కూడా జిహాదీ దేశమే అని మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారామె. ఇలా కోరుకునే వారందరికీ అభినందనలు అంటూ ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇంత కాలం బీజేపీని మోస్తూ, రైతాంగ పోరాటాల‌ను త‌ప్పు ప‌డుతూ వ‌చ్చిన కంగ‌నా…వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు నిర్ణ‌యాన్ని జీర్ణించుకోలేకున్నారు. అందుకే మోడీ స‌ర్కార్‌ను ఉతుకుతోంది.