తెలంగాణలో రాజకీయ శత్రువులెవరంటే….ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొండా దంపతులని ఎవరైనా చెబుతారు. కాలం మారినా, వాళ్లలో మాత్రం పగప్రతీకారాలు ఇంకా చల్లారలేదు. పరస్పరం విమర్శల కత్తులు దూసుకుంటూనే వున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్‌రావుపై కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎర్రబెల్లి పుట్టుక గురించి ఆమె ప్రస్తావించడం గమనార్హం.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండా సురేఖ మాట్లా డుతూ తన భర్త మురళిని అంతం చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఎర్రబెల్లి టీఆర్ఎస్‌లో చేరారని ఆమె చెప్పుకొచ్చారు.
తాము టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాతే ఎర్రబెల్లి కూడా పార్టీలో చేరి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎర్రబెల్లి అన్న మాటల్ని ఆమె గుర్తు చేశారు. ఒక తండ్రికే పుట్టానని, టీడీపీని విడిచిపెట్టనని ఎర్రబెల్లి నాడు శపథాలు చేశారన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారన్నారు.
ఎంత మంది తండ్రులకు పుట్టింటే టీఆర్ఎస్‌లో చేరారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. గతంలో టీడీపీలో చేరాలని తమను చంద్రబాబు ఆహ్వానించారని కొండా సురేఖ తెలిపారు. కానీ ఆ పార్టీలో ఎర్ర బెల్లి దయాకర్ ఉండటంతో చేరలేదన్నారు.