అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ సంచలనం సృష్టిస్తోంది. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రత్యేక పరిశీలకుడు ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఇక్కడ 25 వార్డులుండగా ఒక వార్డు వైసీపీకి ఏకగ్రీవమైంది. ఇందులో 14వ వార్డు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముందుగా 1 నుంచి 15వార్డుల కౌంటింగ్‌ను చేపట్టారు.
వీటిలో 5 వార్డుల్లో వైసీపీ విజయం, 5 వార్డుల్లో ముందంజ. కేవలం 4 వార్డుల్లో టీడీపీ ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఇక 10 వార్డుల కౌంటింగ్ చేపట్టాల్సి వుంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ….ఈ ఎన్నికపై పాలకప్రతిపక్ష పార్టీలు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాయి.
కుప్పంలో ఎలాగైనా చంద్రబాబును ఓడించితీరుతామని అధికార పార్టీ ప్రతినబూనింది. ఆ పార్టీ అనుకున్నట్టే అనూహ్య, సంచలన విజయాలను వైసీపీ నమోదు చేసుకుంటోంది.
తాజా ఫలితాలపై వైసీపీలో ఉత్సాహం ఉరకలేస్తుండగా, టీడీపీ శ్రేణులు తీవ్రనిరాశకు గురి అవుతున్నాయి. మొత్తానికి కుప్పంపై మొదటి బ్రేకింగ్ న్యూస్ టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.