ఈ కేసులో తప్పెవరిది.. సోషల్ మీడియాలో చర్చ

అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకొని వార్తల్లో వ్యక్తిగా నిలిచిన ఉమాపతి జైలుపాలయ్యాడు. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఉమాపతిని సమర్థిస్తుంటే, మరికొంతమంది పోలీసుల్ని సమర్థిస్తున్నారు. Advertisement ఇంతకీ…

అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకొని వార్తల్లో వ్యక్తిగా నిలిచిన ఉమాపతి జైలుపాలయ్యాడు. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఉమాపతిని సమర్థిస్తుంటే, మరికొంతమంది పోలీసుల్ని సమర్థిస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగింది? కర్నాటకలోని కోలార్ లో సుప్రియ-లలిత అక్కాచెల్లెళ్లు. చిన్నప్పట్నుంచే ఇద్దరికీ సమస్యలున్నాయి. ఒకరికి వినిపించదు, మరొకరు మాట్లాడలేరు. దీనికితోడు తండ్రికి ఆర్థిక సమస్యలు. ఇలాంటి టైమ్ లో సుప్రియ పెళ్లీడుకొచ్చింది. ఆమెకు పెళ్లి చేయాలని భావించాడు తండ్రి.

అయితే సుప్రియకు పెళ్లి చేసి పంపిస్తే, లలిత ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే, చిన్నప్పట్నుంచి వీళ్లిద్దరూ కలిసి జీవించారు. తమ సమస్యను అధిగమిస్తూ ఒకరికొకరు సాయంగా ఉన్నారు. 

అందుకే తండ్రి ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దర్నీ ఒకరికే ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా చేయడం వల్ల తన ఆర్థిక కష్టాలు తీరడంతో పాటు అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి ఉంటారని భావించాడు.

సహజంగా ఇలాంటి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకునేందుకు ఎవ్వరూ ముందుకురారు. కానీ అదే ప్రాంతానికి చెందిన 31 ఏళ్లు ఉమాపతి ముందుకొచ్చారు. ఇద్దర్నీ ఒకేసారి పెళ్లాడాడు. అయితే ఇది సామాజిక మాధ్యామాల్లో మరోలా ప్రచారమైంది. చిన్నమ్మాయి మేజర్ కాదని, మైనర్ అయిన అమ్మాయికి పెళ్లి చేశారంటూ ప్రచారం జరిగింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉమాపతిని అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో ఏడుగురిపై కేసులు పెట్టారు. ఈ కేసులో తప్పెవరిదంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.