అసెంబ్లీలో సేమ్ సీన్. పోతూపోతూ ఇద్దరు దండం పెట్టారు. ఇద్దరూ ప్రతిపక్ష నేతల హోదాల్లో అసెంబ్లీని బహిష్కరించారు. అయితే ఇద్దరూ 19వ తేదీనే అసెంబ్లీని బహిష్కరించడం గమనార్హం.
సంవత్సరం, నెల మాత్రమే తేడా. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సమావే శాలను బహిష్కరించిన జగన్… ఆ తర్వాత ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెట్టి తన పంతం నెరవేర్చుకున్నారు.
67 మంది ఎమ్మెల్యేలతో వైసీపీ నేతగా, బలమైన ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ 2014లో అసెంబ్లీలో అడుగు పెట్టారు. ముఖ్యమంత్రిగా సీనియర్ నేత చంద్రబాబు, స్పీకర్‌గా కోడెల శివప్రసాద్. పిన్న వయస్కుడైన జగన్‌కు రాజకీయాలు, ఇతరత్రా అంశాలపై పరిజ్ఞానం వుందడని భావించిన టీడీపీ నేతలకు జగన్ కొరకరాని కొయ్య అయ్యారు. దీంతో అతనికి అసెంబ్లీలో మాట్లాడేందుకే అవకాశం దక్కలేదు.
సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం లేని సభ తనకు అవసరం లేదంటూ… 2015, మార్చి 19న వైఎస్ జగన్ అసెంబ్లీని బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది అందరికీ తెలిసిందే.
ఇక ప్రస్తుతానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భార్యను అవమానించేలా వైసీపీ సభ్యులు వ్యవహరించారనే ఆగ్రహంతో అసెంబ్లీని బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తిరిగి తాను ముఖ్యమంత్రిగా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేయడం చర్చనీయాంశమైంది.