బాబుకు మరో రిటర్న్ గిఫ్ట్ రెడీ అవుతోంది

రిటర్న్ గిఫ్ట్.. ఈ పదం మొన్న ఎన్నికల్లో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి, అతడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. చెప్పినట్టుగానే బాబు చిత్తుచిత్తుగా…

రిటర్న్ గిఫ్ట్.. ఈ పదం మొన్న ఎన్నికల్లో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి, అతడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. చెప్పినట్టుగానే బాబు చిత్తుచిత్తుగా ఓడిపోయారు.

బాబు ఓడిన తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రిటర్న్ గిఫ్ట్ అంశాన్ని లేవనెత్తారు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ మరొకటి బాబుకు రెడీ అవుతోంది. ఈసారి ఈ రిటర్న్ గిఫ్ట్ ఇస్తోంది ప్రధాని మోడీ.

ఎన్నికల టైమ్ లో మోడీని అనరాని మాటలన్నారు బాబు. ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేశారు. మోడీ భార్య పేరును కూడా రాజకీయాల్లోకి లాగి, మరింత దిగజారారు. ఇవన్నీ ఒకెత్తయితే.. పొత్తు నియమాల్ని పాటించకుండా సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీతో తెగతెంపులు చేసుకొని, వెన్నుపోటు రాజకీయాలకు తెరదీశారు. మోడీని అనరాని మాటలన్నారు. తిరుపతి వచ్చిన అమిత్ షా పై రాళ్లు వేయించారు.

అప్పట్లో తనకు, తన పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని మోడీ మరిచిపోలేదు. అలా మరిచిపోయే రకం కూడా కాదు. ప్రతిది నోట్ చేసి మరీ రాసిపెట్టుకునే రకం. సమయం వచ్చినప్పుడు లెక్కకట్టి మరీ బదులు తీర్చుకుంటారు. ఇన్నాళ్లకు ఆ సమయం రానే వచ్చింది. చంద్రబాబుకు తనదైన స్టయిల్ లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ప్రధాని.

పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి-అక్రమాలపై ఇప్పటికే ప్రధాని మోడీకి వివరించారు ముఖ్యమంత్రి జగన్. దీనిపై తయారుచేసిన పూర్తి నోట్ ను ప్రధానికి అందించినట్టు సమాచారం. ఇక పోలవరం లెక్కల్లో అవకతవకల్ని ఇప్పటికే పూర్తిస్థాయిలో కూపీలాగిన ఆర్థిక మంత్రి బుగ్గన కూడా..తాజాగా దీనికి సంబంధించిన అవకతవకల వివరాల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అందించినట్టు తెలుస్తోంది. 

మరోవైపు స్వయంగా ప్రధాని మోడీ గతంలో పోలవరం ప్రాజెక్టుపై విమర్శలు చేయడం గమనార్హం. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం ఏటీఎంలా వాడుకుందని స్వయంగా ప్రధాని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

సో.. ముందుగా పోలవరం ప్రాజెక్టు అవినీతిపైనే విచారణ సాగించేలా కేంద్రం రంగంలోకి దిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు వైసీపీ నేతలు. దీనికి సంబంధించి తెరవెనక కసరత్తు జరుగుతోందని.. పూర్తిస్థాయిలో ఆధారాలు, డాక్యుమెంట్లు అన్నీ సిద్ధమైన తర్వాత ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రధాని ఆదేశించే అవకాశం ఉందని అంటున్నారు.

అమరావతిలో జరిగిన భూ కుంభకోణం కంటే ముందే పోలవరం అవినీతిపై విచారణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇదే కనుక జరిగితే చంద్రబాబుకు మోడీ, చాలా పెద్ద “రిటర్న్ గిఫ్ట్” ఇచ్చినట్టే. 

ఆర్ఆర్ఆర్ లో అదే ట్విస్ట్ అంట