సినీ నటుడు, జనసేన నేత నాగబాబుకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అదిరిపోయే రీ ట్వీట్ చేశాడు. జీరో విలువ తెలియని వెధవలకి మనం ఏం చెప్పినా చెవిడి వాడు ముందు శంఖం ఊదినట్టే అంటూ నాగబాబు శుక్రవారం వైసీపీ నేతలపై ఘాటుగా ట్వీట్ చేశాడు. దీనిపై అంబటి రాంబాబు శనివారం తనదైన శైలిలో ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు.
‘నేను ‘తోకలేని పిట్ట’ చిత్రంలో నటించిన సంగతి నేనే మరచితిని.. గుర్తించుకున్నందుకు నాగబాబుగారికి ధన్యవాదాలు. నటనలో ఓటమిపాలై నిష్క్రమించాను నేను.. రాజకీయాలలో ఓటమిపాలైన మీరు నిష్క్రమిస్తారా…. లేక’ అంటూ నాగబాబుపై తనదైన వ్యంగ్యంతో ఘాటుగా రిప్లై ఇచ్చాడు.
నాగబాబు తమ్ముడు, జనసేనాని పవన్‌ను కూడా అంబటి వదలిపెట్టలేదు. ‘బహు పాత్రలలో బాగు బాగు’ అని పేర్కొంటూ వివిధ పార్టీల నేతలతో పవన్ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలను అంబటి షేర్ చేశాడు. అంబటి ట్వీట్ వైరల్ అవుతోంది.