Advertisement

Advertisement


Home > Politics - National

వాట్సాప్ షాక్.. 50 కోట్ల మంది డేటా లీక్

వాట్సాప్ షాక్.. 50 కోట్ల మంది డేటా లీక్

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందంటే, అందులో కచ్చితంగా వాట్సాప్ ఉన్నట్టే. అంతలా జనజీవన స్రవంతిలో భాగమైపోయింది వాట్సాప్. అటు సదరు సంస్థ కూడా డేటా సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. ఛాటింగ్స్ అన్నీ ఎన్-క్రిప్ట్ అవుతాయని, ఎల్లప్పుడూ డేటా సురక్షితంగా ఉంటుందని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటుంది.

ఓవైపు ఇలా నడుస్తుంటే, మరోవైపు ఏకంగా 50 కోట్ల మంది వాట్సాప్ వినియోగాదారుల డేటా లీక్ అయింది. ఎవరికి ఏ అవసరం ఉన్నా, కోట్ల మంది వాట్సాప్ వినియోగదారుల డేటా మొత్తాన్ని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్టు హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్ లో నోటిఫికేషన్ వచ్చింది. దీంతో అంతా గతుక్కుమన్నారు.

లీక్ అయిన 50 కోట్ల మంది డేటాలో భారతీయులు కూడా ఉన్నారు. 32 మిలియన్ల అమెరికన్లు, 11 మిలియన్ల యూకే ప్రజలు, 10 మిలియన్ల రష్యా జాతీయులు, 35 మిలియన్ల ఇటలీ పౌరులు ఈ డేటాలో ఉన్నారు. వీళ్లతో పాటు భారతీయులు, సౌదీ అరేబియన్లు, ఈజిప్షియన్లు లక్షల సంఖ్యలో ఈ లీక్ డేటాలో ఉన్నారు.

ఇలా లీక్ చేసిన డేటాకు రేట్లు కూడా ఫిక్స్ చేశాడు అగంతకుడు. యూఎస్ వాట్సాప్ యూజర్ల డేటా కావాలంటే 7వేల డాలర్లు, యూకే వాట్సాప్ యూజర్ డేటా కావాలంటే 2500 డాలర్లు చెల్లించాలంటూ ధరలు నిర్ణయించారు. ఇలా ప్రతి దేశానికి ఒక్కో రేటు పెట్టాడు.

ఇలా హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్ లో వచ్చిన పోస్ట్ చూసి వాట్సాప్ ఉలిక్కిపడింది. ఆ పోస్టుపై నిజనిర్థారణ చేయడం మొదలుపెట్టింది. ఈ డేటాతో ఫిషింగ్ చేయొచ్చు. కొంతమంది వాట్సాప్ పేమెంట్స్ ను కూడా హ్యాక్ చేయొచ్చు అంటున్నారు నిపుణులు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?