Advertisement

Advertisement


Home > Politics - National

గుజ‌రాత్ లో మునిగి, హిమాచ‌ల్ లో లేచిన కాంగ్రెస్!

గుజ‌రాత్ లో మునిగి, హిమాచ‌ల్ లో లేచిన కాంగ్రెస్!

గుజ‌రాత్ లో గ‌త ఎన్నిక‌ల్లో సాధించుకున్న 77 సీట్ల‌లో మెజారిటీ భాగాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి గ‌ట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ ఈ సారి పూర్తిగా చేతులు ఎత్తేసింది. ఆప్ ఎంట్రీ తో ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్ కు గ‌ట్టి దెబ్బ ప‌డిన‌ట్టుగా ఉంది. ఆప్ గెలవ‌గ‌లుగుతున్న‌ది కూడా ఏడెనిమిది సీట్లే అయినా, ఓట్ల చీలిక‌లో ఆప్ గ‌ట్టి పాత్ర పోషించిన‌ట్టుగా ఉంది. గుజ‌రాత్ లో ఆప్ క‌నీసం ఒక్క సీటు కూడా గెల‌వదంటూ కాంగ్రెస్ బీరాలు ప‌లికింది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తే ఆప్ గ‌ట్టిగానే కాంగ్రెస్ ను దెబ్బ‌తీసింద‌ని స్ప‌ష్టం అవుతోంది.

మ‌రి గుజ‌రాత్ లో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయినా.. హిమాచ‌ల్ మాత్రం కాంగ్రెస్ కు అవ‌కాశం ఇచ్చేసింది! 68 అసెంబ్లీ సీట్లున్న ఈ బుల్లి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ద‌క్కుతోంది. క‌నీసం 35 అసెంబ్లీ సీట్లు ద‌క్కితే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌ల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌స్తుతానికి 39 సీట్ల‌లో లీడ్ లో ఉంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ వెనుకంజ‌లో ఉంది. కేవ‌లం ముగ్గురు ఇత‌రులు లీడ్ లో ఉన్నారు. స్థూలంగా హిమాచ‌ల్ లో కాంగ్రెస్ పార్టీ కి ప్ర‌జ‌లు అవ‌కాశం ఇచ్చారు.

అయితే ఈ అవ‌కాశాన్ని కాంగ్రెస్ కు బీజేపీ ద‌క్క‌నిస్తుందా? 39 మంది ఎమ్మెల్యేల్లో కొంత‌మందిని చీల్చి ఎంత‌కాలం అక్క‌డ కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఉండ‌నిస్తుంది! అనేవ‌న్నీ వేరే లెక్క‌లు. ప్ర‌జ‌లైతే కాంగ్రెస్ కు స్ప‌ష్ట‌మైన విజ‌యాన్ని ఇచ్చారు.

హిమాచ‌ల్ లోని బీజేపీ ముఖ్య‌మంత్రి రాజీనామాను ప్ర‌క‌టించారు. గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి రాజీనామాను ఇవ్వ‌బోతున్న‌ట్టుగా తెలిపారు. ఇలా ముఖ్య‌మంత్రి హోదాలోని వ్య‌క్తి ఓట‌మిని ఒప్పుకున్నారు. మోడీ, అమిత్ షాల స్వ‌రాష్ట్రం గుజ‌రాత్ లో కాంగ్రెస్ కు భంగ‌పాటు ఎదురైనా.. బీజేపీ జాతీయాధ్య‌క్షుడు న‌డ్డా సొంత రాష్ట్రం హిమాచ‌ల్ లో మాత్రం కాంగ్రెస్ కు అవ‌కాశం ద‌క్కింది. బీజేపీ ప్ర‌భుత్వ స్థానంలో కాంగ్రెస్ కు అవ‌కాశం ద‌క్కింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?