Advertisement

Advertisement


Home > Politics - National

రాజకీయాల్లోకి రాని 'క్ష‌త్రియులు'!

రాజకీయాల్లోకి రాని 'క్ష‌త్రియులు'!

బ్రిటీష్ రాజ‌వంశానికి సంబంధించిన ఎన్నో ఆసక్తిదాయ విష‌యాల్లో ఒక‌టి వారు రాజ‌కీయాల్లోకి రాక‌పోవ‌డం కీల‌క‌మైన‌ది. బ్రిట‌న్ రాజ‌వంశానికి బ్రిటీష‌ర్ల‌లో ఎంతో అత్యున్న‌త స్థాయి గౌర‌వం ఉంది. ప్ర‌స్తుతం బ్రిట‌న్ ను అధికారికంగా ఏలుతున్న వేల్స్ రాజ‌కుటుంబం మూడు వంద‌ల యేళ్ల‌కు పై నుంచి అక్క‌డ రాజ‌రికాన్ని చ‌లాయిస్తోంది. 

1707లో కింగ్డ‌మ్ ఆఫ్ ఇంగ్లాండ్, కింగ్డ‌మ్ ఆఫ్ స్కాట్ లాండ్, కింగ్డ‌మ్ ఆఫ్ ఐర్లాండ్ ల క‌ల‌యితో నాటి యూనైటెడ్ కింగ్డ‌మ్ ఏర్ప‌డింది. అప్పుడు సంప్ర‌దాయాల ప్ర‌కారం.. మోనార్క్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు క్వీన్ యాన్.

ఆ త‌ర్వాత బ్రిటీష్ కింగ్డ‌మ్  ఎంతో విస్త‌రించింది. కాల‌నీలు ఏర్పాటు చేసుకుంది. కాల‌నీల‌కు కూడా క్వీన్ లేదా కింగ్ మోనార్క్ అయ్యారు. ఇండియాలో ఈస్టిండియా కంపెనీ పాల‌న అంత‌మ‌య్యాకా.. పూర్తిగా బ్రిటీష్ రాజుల పాలిటే పాల‌న సాగింది. ఇప్ప‌టికీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ఒక‌నాటి బ్రిటీష్ కాల‌నీలు.. బ్రిట‌న్ నాగ‌రిక‌త విస్త‌రించిన దేశాల్లో బ్రిటీష్ క్వీన్ లేదా కింగ్  ను త‌మ మోనార్క్ గానే భవించే సంప్ర‌దాయం ఉంది!

గ‌త మూడు వంద‌ల యేళ్ల‌లో 13 వ రాజు చార్లెస్ త్రీ.  క్వీన్ ఎలిజ‌బెత్ 2 పెద్ద కొడుకు ఇత‌డు. ఇప్ప‌టికీ రాజుల ఇంటి పెళ్లిళ్లు,  శుభ‌కార్యాలు అంటే బ్రిట‌న్ కు పండ‌గ‌! మూడో చార్లెస్ పెద్ద కొడుకు ప్రిన్స్ విలియ‌మ్, కేట్ ల పెళ్లి అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. బ్రిట‌న్ కే పెద్ద పండ‌గలా వారి పెళ్లి  జ‌రిగింది కొన్నేళ్ల కింద‌ట‌. వారు జంట‌గా ఎక్క‌డ క‌నిపించినా.. అదొక క్రేజీ సీనే! రాజ‌కుటుంబానికి సంబంధించిన అన్ని వ్య‌వ‌హారాలూ బ్రిట‌న్ లో ఎంతో భావోద్వేగ‌పూరిత‌మ‌వుతూనే ఉన్నాయి.

మ‌రి ఈ గౌర‌వాన్ని ఈ త‌రంలోనూ కాపాడుకుంటోందంటే అది బ్రిట‌న్ రాజ‌కుటుంబం వ్య‌వ‌హ‌రించే తీరులో కూడా ఎంతో ప‌రిప‌క్వ‌త ఉన్న‌ట్టే. ఆ సామ్రాజ్యానికి రాజ‌రిక వార‌సులం అని చెప్పి ఈ కుటుంబీకులు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో జోక్యం చేసుకునే ప్ర‌య‌త్నాలు చేయ‌రు. ప్ర‌జ‌ల‌కు స‌న్నిహితులుగానే ఉంటారు, అలాగ‌ని రాజ‌కీయ ప్ర‌మేయం చేయ‌రు. బ్రిటీష్ రాజ‌రిక కుటుంబం పెట్టుకున్న అది పెద్ద , క‌ఠిన నియ‌మం ఏమిటంటే.. రాయ‌ల్ ఫ్యామిలీ నుంచి ఎవ్వ‌రూ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వెళ్ల‌కూడ‌ద‌నేది!

కుటుంబానికి బోలెడ‌న్ని వ్యాపారాలున్నాయి. ప్ర‌థ‌మ సంతానం రాజులు లేదా రాణిల‌వుతారు. బ‌తికున్న‌న్ని రోజులూ వారే ఆ హోదాలో ఉంటారు. మిగ‌తా వారికి ప‌ద‌వులపై ఆశ‌లున్నా, లేక‌పోయినా.. వారు రాజ‌కీయాల్లోకి రారు. అలాగే ప్ర‌ధాని ఎన్నిక‌లో అయినా, ఎన్నిక‌ల సంద‌ర్భంలో అయినా రాజు లేదా రాణి ఎవ‌రికీ అనుకూలంగా వ్య‌తిరేకంగా ప్ర‌క‌ట‌న చేయ‌రు. ఫ‌లానా వారిని గెలిపించ‌మ‌ని లేదా గెలిపించ‌వ‌ద్ద‌ని చెప్ప‌రు. ఇలాంటి విష‌యాలు, వారికి వారు పెట్టుకున్న సంప్ర‌దాయాలే వారికి ప్ర‌జ‌ల్లో గౌర‌వాన్ని నిలుపుతున్నాయి. అలాగే బ్రిటీష్ రాజ‌కుటుంబం అక్క‌డి టాక్స్ పేయ‌ర్స్ సొమ్ముతో విలాసాల‌ను చేయ‌దు. వారికి ప్ర‌త్యేకంగా వ్యాపారాలు, భూములు ఉంటాయి. వాటి నుంచి ఆదాయ‌మే రాజ‌కుటుంబానికి కావాల్సినంత స్థాయిలో ఉంటుంది. ప్ర‌భుత్వం నుంచి లాంఛ‌నాలు అంద‌వ‌చ్చంతే!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?