ఆ రెస్టారెంట్ లో సెల్ ఫోన్లు బంద్

ఔట్ డౌర్ లో సెల్ ఫోన్ కామన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా రెస్టారెంట్ కు వెళ్తే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేముందు, ఆర్డర్ టేబుల్ పైకి వచ్చిన తర్వాత కూడా స్మార్ట్ ఫోన్ చూస్తూ కాలం…

ఔట్ డౌర్ లో సెల్ ఫోన్ కామన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా రెస్టారెంట్ కు వెళ్తే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేముందు, ఆర్డర్ టేబుల్ పైకి వచ్చిన తర్వాత కూడా స్మార్ట్ ఫోన్ చూస్తూ కాలం గడిపేస్తుంటారు జనం. ఈ పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించింది జపాన్ కు చెందిన ఓ రెస్టారెంట్.

టోక్యోలోని డెబూ-చా రెస్టారెంట్ చాలా ఫేమస్. అయితే అక్కడికి వచ్చే కస్టమర్లంతా స్మార్ట్ ఫోన్లలో మునిగిపోయి, టైమ్ వేస్ట్ చేస్తున్నారు. ఆహారాన్ని ఆస్వాదించలేకపోతున్నారట. దీనిపై రెస్టారెంట్ వెర్షన్ చూద్దాం..

ఓ కస్టమర్ భోజనం ఆర్డర్ చేసిన తర్వాత, అది టేబుల్ పైకి వచ్చిన 4 నిమిషాల వరకు తినలేదట. అలా పోన్ చూస్తూ గడిపేశాడు. దీంతో దాని అసలు టేస్ట్ మారిపోయిందంట. చెఫ్ చాలా ఫీల్ అయ్యాడట.

మరో కస్టమర్ ఫేమస్ నూడుల్స్ ఆర్డర్ చేశాడట. ఒక్కో నూడుల్ మందం మిల్లీమీటర్ కూడా ఉండదు. అంత సాఫ్ట్ నూడిల్స్ ను సెల్ ఫోన్ చూస్తు కిచిడీ చేసేశాడంట. దీంతో ఆ చెఫ్ కూడా చాలా బాధపడ్డాడట.

ఇవన్నీ పక్కనపెడితే.. ఆ రెస్టారెంట్ చాలా బిజీ. 33 సీట్లు ఉన్న ఆ రెస్టారెంట్ లో పీక్ టైమ్ లో ఒక్కో సీటుకు 10 మంది వెయిట్ చేస్తుంటారట. అలాంటి టైమ్ లో కస్టమర్ ఫోన్ చూస్తూ కూర్చుంటే, బిజినెస్ దెబ్బతింటోంది.

అందుకే తమ రెస్టారెంట్ కు వస్తే మొబైల్ బంద్ చేయాలని రూల్ పెట్టింది సదరు హోటల్. పొరపాటున ఎవరైనా మొబైల్ తీసినా, లోపల పెట్టాలని నిర్మోహమాటంగా చెబుతున్నారట. ఈ నిర్ణయం ఆ రెస్టారెంట్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.