Advertisement

Advertisement


Home > Politics - National

మెటాలో మరో రౌండ్.. వేల ఉద్యోగాలకు ఎసరు?

మెటాలో మరో రౌండ్.. వేల ఉద్యోగాలకు ఎసరు?

మెటాలో ఊచకోత మొదలైంది. తొలి రౌండ్ లో ఏకంగా 11వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపిన మార్క్ జుకెర్ బర్గ్, రెండో రౌండ్ లో మరింతమందికి పొగపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. గతేడాది చివర్లో 11వేల మందికి లేఆఫ్ ప్రకటించింది మెటా. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో అది 13శాతానికి సమానం. రెండోసారి అంకెలు బయటకు రాలేదు కానీ, భారీ మొత్తంలో ఉద్యోగులకు చెక్ పెట్టబోతున్నారనే విషయం మాత్రం ప్రచారంలోకి వచ్చింది.

ప్రస్తుతానికి అధికారికంగా దీనిపై ప్రకటన విడుదల కాలేదు. అటు మెటా ఉద్యోగుల్లో కొంతమంది అలాంటిదేమీ లేదంటున్నారు. కానీ ఫేస్ బుక్, ఇనస్టా గ్రామ్ యాడ్ రెవెన్యూ రోజురోజుకీ తగ్గిపోతున్న వేళ, వేటు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు ఆర్థిక మాంద్యం గుప్పిట చిక్కుకుంటున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగం కూడా తల్లడిల్లిపోతోంది. 

సోషల్ మీడియాకి క్రేజ్ తగ్గకపోయినా యాడ్ రెవెన్యూ విషయంలో ఇటీవల స్థానిక ప్రభుత్వాలు, సోషల్ మీడియాకి కూడా మార్గదర్శకాలు రూపొందించాయి. దీంతో మెటా గుప్తాధిపత్యానికి బ్రేక్ పడింది.

గత నవంబర్ లో గుంపగుత్తగా ఉద్యోగుల్ని తొలగించే సమయంలో వారందరితో వీడియో కాల్ లో మాట్లాడారు మార్క్ జుకర్ బర్గ్. ఆయన నిర్ణయాన్ని చాలామంది తప్పుబట్టినా, సంస్థ కోసం త్యాగం చేయక తప్పదన్నారు. అన్ని బకాయిలు ఇచ్చి పంపించేస్తున్నామని చెప్పారు.

ఇప్పుడు మరోసారి ముందస్తు హెచ్చరికలేవీ లేకుండా రెండో రౌండ్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ వారంలోనే లేఆఫ్ పై ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. నేరుగా ఉద్యోగులకే మెయిల్స్ వెళ్లే అవకాశముంది. మెటా వర్గాలు మాత్రం దీనిపై గుంభనంగా ఉన్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?