Advertisement

Advertisement


Home > Politics - National

ఈ కుక్క ఏకంగా గిన్నిస్ బుక్ ఎక్కేసింది?

ఈ కుక్క ఏకంగా గిన్నిస్ బుక్ ఎక్కేసింది?

కాలిఫోర్నియాకు చెందిన ఈ కుక్క పేరు జినో. తాజాగా ఈ మగ కుక్క గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కింది. కారణం దీని వయసు. అవును.. దీని వయసు అక్షరాలా 22 సంవత్సరాల 2 నెలలు. ఓ కుక్క ఇన్నేళ్లు బతకడం అరుదైన విషయం. అందుకే గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత పెద్ద వయసున్న కుక్క ఇదే.

2000 సంవత్సరంలో పుట్టింది ఈ కుక్క పిల్ల. 2002లో కాలిఫోర్నియాకు చెందిన అలెక్స్ దీన్ని దత్తత తీసుకున్నాడు. అప్పట్నుంచి కన్న బిడ్డలా దీన్ని సాకాడు. మంచి ఆహారాన్ని అందించడంతో పాటు, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించాడు. మిగతా కుక్కల కంటే ఎక్కువగా, ప్రతి రోజూ బయట తిప్పేవాడు. అదే ఈ కుక్క ఆరోగ్య రహస్యం అంటున్నాడు అలెక్స్.

సాధారణంగా కుక్కలు 15-16 ఏళ్లు బతుకుతాయి. కొన్ని జాతి కుక్కలు గరిష్ఠంగా 20 ఏళ్లు బతుకుతాయి. జినో మాత్రం 22 ఏళ్లు నిండినా ఇంకా ప్రాణాలతోనే ఉంది. అదే రికార్డ్.

ప్రస్తుతం ఇది మిగతా కుక్కల్లా చురుగ్గా లేదు. ఎందుకంటే, దీని చూపు మందగించింది. ఒకప్పుడు బీచ్ లో ఎగిరి గంతేసే ఈ కుక్క, ఇప్పుడు ఎక్కువ సేపు నిద్రపోతోంది. సాల్మన్ చేపల్ని ఇది ఇష్టంగా తింటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?