స్థానిక ఎన్నికల నిర్వహణకు నో అన్న ప్రభుత్వం

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి రాష్ట్రంలో లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను కలిసి…

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి రాష్ట్రంలో లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను కలిసి ప్రభుత్వ నివేదికను సమర్పించారు. 

రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో కరోనాను నియంత్రిస్తున్నాం కానీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని నివేదికలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదని ఆమె తెలిపారు. ఎప్పటికప్పుడు దీనిపై నివేదికలు ఇస్తామని, పరిస్థితి సానుకూలంగా ఉన్నప్పుడు తాము తెలియచేస్తామని సి.ఎస్ వివరించారు.

ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడ్డారని ఆమె తెలిపారు. సుమారు 11 వేల మంది పోలీసులు కరోనా కు గురి అయ్యారని ఆమె చెప్పారు.

ఈ భేటీలో పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.