పవన్ కు పండగే.. ఇకపై 24 గంటలూ నటనే

రాజకీయాల సంగతి పక్కనపెడితే సినిమాల్లో పవన్ మంచి నటుడు, నటనే కాదు, ఆయన మేనరిజంకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే కొన్నాళ్లుగా అది మరుగునపడిపోయిందనుకోండి, ఇప్పుడు పింక్ రీమేక్ తో మొహానికి మేకప్ వేసుకుని,…

రాజకీయాల సంగతి పక్కనపెడితే సినిమాల్లో పవన్ మంచి నటుడు, నటనే కాదు, ఆయన మేనరిజంకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే కొన్నాళ్లుగా అది మరుగునపడిపోయిందనుకోండి, ఇప్పుడు పింక్ రీమేక్ తో మొహానికి మేకప్ వేసుకుని, కెమెరా ముందుకొచ్చిన పవన్ కల్యాణ్ పూర్తిగా షూటింగ్ మూడ్ లోకి వచ్చేసినట్టు కనపడుతోంది. అయితే ట్విస్ట్ ఏంటంటే.. మంగళగిరి పార్టీ ఆఫీస్ లోకి వచ్చినా కూడా ఆయన ఆ మూడ్ లో నుంచి బైటకు రాలేకపోయారు. 

సహజంగానే పవన్ కెమెరాలకు మంచి ఫోజులిస్తుంటారు, అందులోనూ నేరుగా షూటింగ్ స్పాట్ నుంచి జనాల్లోకి వచ్చేసరికి అది ఇంకాస్త ఎక్కువైంది. రెండు రోజులుగా పవన్ వ్యవహారం చూస్తుంటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. తనని కలవడానికి వచ్చిన అమరావతి మహిళా రైతులతో పవన్ పెద్ద సెంటిమెంట్ సీన్ క్రియేట్ చేశారు. వాళ్లతో పవన్ మాట్లాడిన విధానం, ఆయన హావభావాలు అత్తారింటికి దారేది క్లైమాక్స్ సీన్ ను గుర్తుకుతెచ్చాయి.

మహిళా రైతుల్ని కుర్చీల్లో కూర్చోబెట్టి, తాను మాత్రం వారి ముందు కింద కూర్చుని బాధలు విన్నారు. అయ్యా మీకు ఎక్కడ దెబ్బ తగిలింది, అమ్మా మిమ్మల్ని ఎక్కడ కొట్టారు అంటూ తెగ యాక్టింగ్ చేశారు, నా రక్తం మరిగిపోతోంది, వైసీపీని గద్దె దించేదాకా వదలను అని  రివేంజ్ డైలాగులు కూడా కొట్టారు. ఈ వీరావేశ డైలాగుల కంటే సెంటిమెంటే సీన్లే బాగా రక్తికట్టించారు పవన్. కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నట్టు రెప్పలు ఆర్పుతూ పవన్ ప్రదర్శించిన హావభావాలు చూస్తే.. నిజంగా పవన్ అద్భుతమైన నటుడు అనిపించక మానదు. ఇన్నాళ్లూ ఈ యాక్టింగ్ ని ఎక్కడ దాచిపెట్టాడా అనిపిస్తుంది.. 

మొత్తమ్మీద పవన్ 24 గంటలూ ఇక నటించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నమాట. పగలు సినిమా కెమెరాల ముందు షూటింగ్ లో, సాయంత్రం మీడియా కెమెరాల ముందు జనాలతో. అక్కడా ఇక్కడా పవన్ యాక్టింగ్ చించేస్తున్నారు. గతంలో కంటే పవన్ కి ఇప్పుడే ఎక్కువ సౌకర్యంగా ఉందేమో. ప్యాకప్ చెప్పిన తర్వాత కూడా పవన్ షూటింగ్ మోడ్ నే కంటిన్యూ చేస్తూ పొలిటికల్ సీన్స్ ని కూడా రక్తి కట్టిస్తున్నారు.

జగన్ ఒక బ్రాండ్

విద్యార్ధులపై వైయస్ జగన్ వరాల జల్లు