ఎన్నారే బాబూ… అధార్ కార్డుందా… ?

ఏపీలో చిత్ర విచిత్ర రాజకీయం సాగుతోంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గత రెండున్నరేళ్ళుగా హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. ఆయన నివాసం అక్కడే. దాంతో చంద్రబాబుని నాన్ రెసిడెంట్ ఆంధ్రా అని అంటున్నారు…

ఏపీలో చిత్ర విచిత్ర రాజకీయం సాగుతోంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గత రెండున్నరేళ్ళుగా హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. ఆయన నివాసం అక్కడే. దాంతో చంద్రబాబుని నాన్ రెసిడెంట్ ఆంధ్రా అని అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్. ఎక్కడో హైదారాబాద్ లో కూర్చుని ఏపీ ప్రభుత్వం మీద బాబు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

కనీసం ఏపీ అడ్రస్ తో ఆధార్ కార్డు అయినా ఉందా బాబూ అంటూ గుడివాడ నిలదీశారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బ తీసైనా రాజకీయం చేద్దామనుకోవడం కంటే దారుణం వేరే ఉండదని ఫైర్ అయ్యారు. 

ఎక్కడో గుజరాత్ లో మాదక ద్రవ్యాలు పట్టుబడితే దానికీ ఏపీకి లింక్ పెట్టి మరీ విషం చిమ్మే టీడీపీ నేతల మీద కేసులు నమోదు చేయాల‌ని ఆయన డీజీపీని కోరారు.

ఏపీ అసలే ఇబ్బందులో ఉందని, అలాంటి రాష్ట్రంలో తనకు అధికారం పోయిందన్న దుగ్దతో చంద్రబాబు అనుకూల మీడియా ద్వారా వైసీపీ మీద బురద జల్లుతున్నారని గుడివాడ ఆరోపించారు. ఏపీ ఇమేజ్ ని దెబ్బతీస్తే నష్టపోయేది ఎవరో ముఖ్యమంత్రిగా చాన్నాళ్ళ పాటు పనిచేసిన బాబుకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. 

దేశంలో ఎక్కడ ఏమీ జరిగినా వైసీపీ నేతలకు ముడి పెడుతూ ఆధారం లేకుండా నిందలు వేస్తున్న టీడీపీ నేతల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని డిమాండ్ చేశారు. మొత్తానికి బాబును ఎన్నారైగా ఆయన  తేల్చేశారు.