మరో వాయించే ‘వకీల్ సాబ్’ వస్తున్నాడు

కోర్టులో వాదించడం తెలుసు, కోటు తీసి కొట్టడం తెలుసు అంటాడు వకీల్ సాబ్. దాదాపు ఇవే లక్షణాలతో వస్తున్నాడు లాయర్ రామచంద్ర. తిమ్మరుసు సినిమాలో సత్యదేవ్ పాత్ర పేరు ఇది. అక్కడక్కడ సాఫ్ట్ గా…

కోర్టులో వాదించడం తెలుసు, కోటు తీసి కొట్టడం తెలుసు అంటాడు వకీల్ సాబ్. దాదాపు ఇవే లక్షణాలతో వస్తున్నాడు లాయర్ రామచంద్ర. తిమ్మరుసు సినిమాలో సత్యదేవ్ పాత్ర పేరు ఇది. అక్కడక్కడ సాఫ్ట్ గా కనిపిస్తూనే, యాక్షన్ మోడ్ లోకి ఎంటరయ్యే లాయర్ పాత్రలో సత్యదేవ్ కనిపిస్తున్నాడు. ఈరోజు ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది.

8 ఏళ్ల కిందట క్లోజ్ అయిన కేసును లాయర్ రామచంద్ర ఎందుకు ఓపెన్ చేశాడు.. ఈ క్రమంలో సాఫ్ట్ గా ఉండే రామచంద్ర ఎందుకు వయొలెంట్ గా మారాడు అనేది ఈ సినిమా స్టోరీ. మధ్యలో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ తో రొమాంటిక్ ట్రాక్ కూడా పెట్టారు. 

కేవలం రొమాన్స్ కే పరిమితం చేయకుండా, హీరోయిన్ పాత్రకు కథకు కూడా ఏదో లింక్ ఉందని ట్రయిలర్ లో చూపించారు. మొత్తమ్మీద సినిమా స్టోరీలైన్ ఏంటి, ఏ జానర్ అనే విషయాన్ని ట్రయిలర్ తో క్లియర్ గా చెప్పేశారు.

“త‌ను తెలివైన‌వాడే కానీ.. ప్రాక్టిక‌ల్ ప‌ర్స‌న్ కాదు..ఎవరైనా కేసు గెలిస్తే బైక్ నుండి కారుకి వెళతారు.. రామ్ కారు నుండి బైక్‌కి వచ్చాడు..” లాంటి డైలాగ్స్ తో హీరో క్యారెక్టరైజేషన్ ను కూడా చెప్పేశారు. ఇక బ్రహ్మాజీ విషయానికొస్తే, ట్రయిలర్ చూస్తుంటే, ఈ నటుడికి మరో మంచి పాత్ర పడినట్టు కనిపిస్తోంది.

శరణ్ కొప్పిశెట్టి డైరక్ట్ చేసిన తిమ్మరుసు సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. 30న థియేటర్లలోకి వస్తోంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్-ఒరిజినల్స్ బ్యానర్లపై మహేష్ కోనేరు, సృజన్ ఈ సినిమాను నిర్మించారు.