ట్రంప్‌తో మోడీని ముడిపెట్టి సొంత పార్టీ ఎంపీ సెటైర్‌

ట్రంప్‌తో ప్ర‌ధాని మోడీని ముడిపెట్టి సొంత పార్టీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి సెటైర్ విసిరారు. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ మ‌రోసారి గెలుపొందాల‌ని బీజేపీ కోరుకున్న విష‌యం తెలిసిందే. అయితే ట్రంప్ త‌న చేష్ట‌ల‌తో అధికారాన్ని…

ట్రంప్‌తో ప్ర‌ధాని మోడీని ముడిపెట్టి సొంత పార్టీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి సెటైర్ విసిరారు. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ మ‌రోసారి గెలుపొందాల‌ని బీజేపీ కోరుకున్న విష‌యం తెలిసిందే. అయితే ట్రంప్ త‌న చేష్ట‌ల‌తో అధికారాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింది. 

ట్రంప్‌తో ప్ర‌ధాని మోడీ మంచి స్నేహ సంబంధాలు కొన‌సాగించారు. లాక్‌డౌన్‌కు ముందు ట్రంప్ మ‌న దేశ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ ఓడిపోయారు. ట్రంప్ ఓట‌మిపై సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఈ సంద‌ర్భంగా బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి తాజా ట్వీట్‌పై బీజేపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఇంత‌కూ ఆయ‌న ఏమ‌న్నారంటే…

“ప్ర‌ధాని మోడీ అమెరికా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ట్రంప్‌న‌కు ట్వీట్ చేసి భార‌త్‌కు ఆయ‌న ఇన్నాళ్లూ మంచి స్నేహితుడిగా ఉన్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలపాలి. అలాగే వ‌చ్చే గణ‌తంత్ర దినోత్స‌వాల‌కు ప్ర‌త్యేక అతిథిగా ఆహ్వానిస్తే బాగుంటుంది” అని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ట్వీట్ చేశాడు.  

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాటికి అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి ట్రంప్ దిగిపోతార‌ని తెలిసి కూడా సుబ్ర‌మ‌ణ్య‌స్వామి వెట‌కారంగా ట్వీట్ చేశాడ‌ని బీజేపీ అభిప్రాయం. అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా బైడెన్ గెలుపొందిన విష‌యం తెలిసిందే.  

ఈయ‌న‌ అధికారికంగా వ‌చ్చే ఏడాది జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాంట‌ప్పుడు కేవ‌లం స్నేహితునిగా ట్రంప్‌ను పిల‌వాల‌ని సుబ్ర‌మ‌ణ్యం స‌ల‌హా ఇస్తున్నారా? అని ప్ర‌త్య‌ర్థులు వ్యంగ్యంగా ప్ర‌శ్నిస్తున్నారు. కొంత కాలంగా సొంత పార్టీపై సుబ్ర‌మ‌ణ్య‌స్వామి విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే.

సీమలో టీడీపీకి దిక్కెవరు?