నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారు..గింజుకుంటున్న పవన్

“లక్ష కోట్లతో రాజధాని నిర్మిస్తామని టీడీపీ ప్రకటించిన సమయంలో కానీ, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీ చెప్పిన సమయంలోనూ జనసేన ప్రమేయం లేదు. అలాంటిది ఇప్పుడు రాజధాని అంశంపై జనసేనను ఎందుకు టార్గెట్…

“లక్ష కోట్లతో రాజధాని నిర్మిస్తామని టీడీపీ ప్రకటించిన సమయంలో కానీ, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీ చెప్పిన సమయంలోనూ జనసేన ప్రమేయం లేదు. అలాంటిది ఇప్పుడు రాజధాని అంశంపై జనసేనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.” ఇదీ పవన్ కల్యాణ్ ఆవేదన. పవన్ బాధంతా అమరావతికి సపోర్ట్ చేయాలనే. అందుకే ఆ ప్రాంత ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి రైతులకు మద్దతుగా నిలవాలని సవాల్ విసిరారు. అయితే అనుకోకుండా తాను టార్గెట్ అయ్యే సరికి విలవిల్లాడిపోతున్నారు.

అసలు రాజధానితో తనకే సంబంధం లేదని చెప్పుకునే పవన్ కల్యాణ్.. తుళ్లూరు రైతుల నిరసనలకు ఎందుకు మద్దతిచ్చారు. గతంలో చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించారు? మూడు రాజధానుల నిర్ణయం జరిగిన తర్వాత ఆవేశంగా అమరావతిలో ఎందుకు పర్యటించారు. ఏదో మేథావిలాగా భవనాలను పరిశీలించి రావాల్సిన అవసరం ఏంటి? అసలు రాజధానులతో నాకేం సంబంధం లేదని చెప్పే పవన్ కల్యాణ్ కి ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉండే అర్హత ఉందా? కనీసం తన స్టాండ్ ఏంటనేది కూడా చెప్పలేని జనసేనాని అసలు రాజకీయ నాయకుడేనా?

అమరావతిని తరలించొద్దు అని నేరుగా చెప్పకుండా రైతుల కన్నీళ్లపై రాజధాని నిర్మించొద్దు అనే డొంకతిరుగుడు సమాధానం ఎందుకు. నేను కూడా టీడీపీకి మద్దతిస్తున్నా.. అమరావతి ఒక్కటే ఏపీకి రాజధాని అని ధైర్యంగా చెప్పొచ్చు కదా? ఆ ధైర్యం లేని పెద్దమనిషి.. ఇలా టెలీ కాన్ఫరెన్స్ లతో ఎందుకు టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారో ఆయనకే తెలియాలి.

పోనీ అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది కదా.. మిగతా ప్రాంతాలైనా అమరావతితో సమానంగా అభివృద్ధి చెందుతాయనే ఆలోచన అయినా పవన్ కి ఉందా? ఉంటే మూడు రాజధానులకు ఆయన మద్దతు తెలపాల్సిందే. ఉత్తరాంధ్ర వెనకబడింది, రాయలసీమ అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిందని చెప్పే పవన్ కల్యాణ్ కి రాజధానులు ఏర్పాటు చేస్తామంటే ఎందుకు నొప్పి?

ఏదీ స్పష్టంగా చెప్పలేని, చెప్పే ధైర్యం లేని పవన్ కల్యాణ్.. జనసేన నాయకులతో జరిగిన టెలికాన్ఫరెన్స్ తర్వాత కూడా అస్పష్టమైన ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అందరికీ మరోసారి టార్గెట్ అయ్యారు. అందులోనూ ఆ రెండు జిల్లాల ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని కోరి మరింత కామెడీ చేశారు పవన్ కల్యాణ్.

చంద్రబాబు స్వయంకృతాపరాధం