జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ‘మూడు’తో అవినాభావ సంబంధమట! ఈ విషయాన్ని వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ తెలిపాడు. విశాఖలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పవన్‌పై సెటైర్లు విసిరాడు.
వ్యక్తిత్వం, నిబద్ధత అనే పదాలకు పవన్ డిక్షనరీలో చోటు లేదన్నాడు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌గా లేదా ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచిన తర్వాతే …2024 సార్వత్రిక ఎన్నికల గురించి మాట్లాడితే బాగుంటుందని పవన్‌కు అమర్‌నాథ్ సూచించాడు. పవన్ ఒక పొలిటికల్ ఫ్రిలాన్సర్ అని అవహేళన చేశాడు.
ఏ సిద్ధాంతం లేని రాజకీయ నేత పవన్ అని వైసీపీ ఎమ్మెల్యే మండిపడ్డాడు. అధికారం కోసం పవన్ తహతహలా డుతున్నాడన్నాడు. పవన్‌కు ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారనే సమాచారం ఉందని ఆయన పేర్కొన్నాడు. పవన్‌కు మూడు బాగా కలిసి వచ్చిందని, అందుకే తృతీయ ప్రత్యామ్నాయం అంటున్నాడని పవన్‌కు చురకలు అంటించాడు. పవన్ కెమెరా ముందు కంటే ప్రజల ముందు బాగా నటిస్తున్నాడని ఆయన విమర్శించారు.
ప్రత్యేక హోదాపై బీజేపీ నుంచి ఎలాంటి హామీ లభించిందో జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశాడు. గతంలో రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని విమర్శించిన విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే గుర్తు చేశాడు. ఇప్పుడు అదే పార్టీతో పవన్ పొత్తు ఎలా పెట్టుకుంటాడని ప్రశ్నించాడు.