ఆ పని చేస్తే పవన్ పొలిటికల్ పవర్ స్టారే

ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోంది, జగన్ ప్రజాభిప్రాయానికి భిన్నంగా వెళ్తున్నారంటూ విమర్శించే పవన్ కల్యాణ్ అనుకున్నట్టుగానే మండలి రద్దుపై కూడా స్పందించారు. మూడు రాజధానుల బిల్లు శాసన మండలికి వెళ్లినప్పటి నుంచీ రభస…

ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోంది, జగన్ ప్రజాభిప్రాయానికి భిన్నంగా వెళ్తున్నారంటూ విమర్శించే పవన్ కల్యాణ్ అనుకున్నట్టుగానే మండలి రద్దుపై కూడా స్పందించారు. మూడు రాజధానుల బిల్లు శాసన మండలికి వెళ్లినప్పటి నుంచీ రభస జరుగుతూనే ఉంది, అయితే అప్పుడు సైలెంట్ గా ఉన్న పవన్, అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందిన తర్వాత తీరిగ్గా పెదవి విప్పారు. మేథావుల చర్చకు అవకాశం లేకుండా పోయిందే అంటూ మొసలి కన్నీరు కార్చారు. 

ఆ ప్రకటన విడుదల కాగానే పవన్ పై ట్రోలింగ్ మొదలైంది. అసలు కౌన్సిల్ లో ఉన్న మేథావులెవరో తేల్చి చెప్పాలనే కామెంట్లు ఎక్కువయ్యాయి. అయితే అవి తర్వాత్తర్వాత పవన్ ఇమేజ్ పైకి టర్న్ అయ్యాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, బీజేపీతో జనసేనకి దోస్తీ ఉంది, మరి నిజంగానే ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించాలనే ఆలోచన పవన్ కి ఉంటే, కేంద్రంలో ఆయనకంత సీన్ ఉంటే.. ఏపీ శాసన మండలి రద్దు కాకుండా ఆపగలరా. సోషల్ మీడియాలో పవన్ ని ఇలాగే ఛాలెంజ్ చేస్తున్నారు నెటిజన్లు. మండలి రద్దు నిర్ణయం తప్పు అంటున్నారు కదా, కేంద్రంలో పలుకుబడి ఉపయోగించి మీరు దాన్ని ఆపొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. 

నిజంగా మండలి రద్దు నిర్ణయాన్ని ఆపగలిగితే పవన్ పొలిటికల్ పవర్ స్టార్ అని ఒప్పుకుంటామని అంటున్నారు నెటిజన్లు. ఆ పనేదో చూడండి అంతేగానీ ఉపయోగంలేని ప్రెస్ నోట్ లు విడుదల చేసి మీ టైమ్ వేస్ట్ చేసుకోకండి, మా టైమ్ వేస్ట్ చేయకండి సార్ అంటూ చురకలంటిస్తున్నారు. కనీసం జనసేన ఎమ్మెల్యే.. రాపాకకు ఉన్న ఇంగిత జ్ఞానం కూడా పవన్ కి లేదే అని ప్రశ్నిస్తున్నారు. 

మండలి రద్దు గురించి మాత్రమే స్పందించిన పవన్ మూడు రాజధానులపై మాత్రం పెదవి విప్పకపోవడం విశేషం. బీజేపీతో జతకట్టిన తర్వాత రాజధానుల విషయంలో పవన్ స్వరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత సహజంగానే పవన్ రంకెలేసేవారు. కానీ అది జరగలేదు, లాంగ్ మార్చ్ కూడా ఆపేసుకున్నారు, ఇప్పుడు రాజధానుల విషయం పక్కనపెట్టి కేవలం మండలిపై మాత్రమే కామెంట్ చేస్తున్నారు. 

ఇదంతా చూస్తుంటే రాజధానుల విషయంలో పవన్ వెనక్కి తగ్గినట్టే తెలుస్తోంది. బీజేపీ కోసం తాను ఎలాగూ వెనక్కి తగ్గాడు కాబట్టి, తన కోసం బీజేపీతో మండలి రద్దు కాకుండా ఆపగలుగుతాడేమో చూడాలి.

రామోజీరావు కోసం అప్పట్లో మండలిని రద్దు చేశారు

ప్రజలు చీకొట్టిన వాళ్ళ ఆమోదం అవసరమా