కొత్త యూట్యూబ్ చాన‌లా …ప‌ర్మీష‌న్ ఫ్లీజ్ !

యూట్యూబ్ చాన‌ల్ ప్రారంభించాల‌నే ఆలోచ‌న రావ‌డ‌మే త‌రువాయి ….వెంట‌నే ఆ ప‌ని చ‌క‌చ‌కా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆన్‌లైన్ చాన‌ల్ ప్రారంభించ‌డం ముందున్న సుల‌భం కాదు.  Advertisement ఎందుకంటే ఇక మీద‌ట ఆన్‌లైన్ చాన‌ల్…

యూట్యూబ్ చాన‌ల్ ప్రారంభించాల‌నే ఆలోచ‌న రావ‌డ‌మే త‌రువాయి ….వెంట‌నే ఆ ప‌ని చ‌క‌చ‌కా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆన్‌లైన్ చాన‌ల్ ప్రారంభించ‌డం ముందున్న సుల‌భం కాదు. 

ఎందుకంటే ఇక మీద‌ట ఆన్‌లైన్ చాన‌ల్ ప్రారంభానికి కేంద్ర స‌మాచారశాఖ అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి. తాజాగా ఇందుకు సంబంధించి కేంద్ర‌ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది. 

పేరుకు ఓటీటీలో పెరిగిపోతున్న అశ్లీల‌తను క‌ట్ట‌డి చేయ‌డానికే అనే మాటే గానీ, కేంద్ర ప్ర‌భుత్వ మ‌దిలో మ‌రో ఉద్దేశం ఉంద‌ని చెబుతున్నారు.

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో కేంద్ర‌ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జ‌రుగుతోంది. అయితే దీన్ని క‌ట్ట‌డి చేయ‌డానికి ఎలాంటి చ‌ట్టాలు లేవు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల సుప్రీంకోర్టు మీడియా నియంత్ర‌ణ‌పై మీ ఉద్దేశం ఏంట‌ని కేంద్రాన్ని ప్ర‌శ్నించింది. 

ప‌త్రిక‌లు, న్యూస్ చాన‌ళ్ల కంటే సోష‌ల్ మీడియాను క‌ట్ట‌డి చేయాల‌ని నివేదించింది. ఆ అవ‌కాశం త‌మ‌కు ఇవ్వాల‌ని దేశ అత్యున్న‌త న్యాయ స్థానాన్ని కేంద్ర ప్ర‌భుత్వం కోరిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఉత్త‌ర్వులు వెలువ‌డ‌డం గ‌మ‌నార్హం. ఇక మీద‌ట సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వ నిఘా ఉండ‌బోతున్న‌ద‌న్న మాట‌.

ఇందులో భాగంగా యూట్యూబ్ చాన‌ల్స్‌, ఓటీటీ కంటెంట్‌ల‌ను స‌మాచార‌, ప్ర‌సార‌శాఖ ప‌రిధిలోకి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చింది. ఈ మేర‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఈ విజయం భాజపా దా? రఘునందన్ దా?