cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అచ్చెన్న మీదకు మరో ఆయుధం ?

అచ్చెన్న మీదకు మరో ఆయుధం ?

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కింజరాపు కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలను  వారు శాసిస్తున్నారు. నేడో రేపో అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అవుతారని కూడా టాక్ నడుస్తోంది.

అయితే అచ్చెన్నాయుడుకు పార్టీలో ప్రమోషన్ ఇచ్చి చంద్రబాబు కిరీటధారణ చేయకుండానే ఆయన ప్రత్యర్ధులకు మాత్రం జగన్ చకచకా పదవులు ఇస్తూ పోతున్నారు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గం ఇంచార్జి గా సీనియర్ నేత దువ్వాడ శ్రీనివాస్ ని నియమించి ఆయనను అనధికార ఎమ్మెల్యేగా మార్చేశారు.

ఇది చాలదన్నట్లుగా ఇపుడు అచ్చెన్నాయుడు మీద గత ఏడాది ఎన్నికల్లో ఓడిన పేరాడ తిలక్ ని కాళింగ కార్పొరేషన్ చైర్మన్ని చేసి బరిలోకి వదిలారు. ఈ పదవి కూడా ఎమ్మెల్యే సరిసాటి అని అంటున్నారు. 

అన్ని రకాలా ప్రోటోకాల్  రూల్స్ వర్తించేలా ఉన్న ఈ పదవితో  తిలక్  నాగలి పట్టి మరీ దున్నేస్తే టెక్కలిలో టీడీపీకి సీన్ కాలడం ఖాయమేనా అన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి విపక్షం కంటే ముందే బీసీల కోటలో వైసీపీ పాగా వేసింది. టీడీపీకి ఎక్కడికక్కడ చెక్ చెప్పేలా పావులు కదిపింది అని అంటున్నారు.

ఇండస్ట్రీలో 123 చిరంజీవే