cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

బాబు ప‌గ‌టి క‌ల‌లు

బాబు ప‌గ‌టి క‌ల‌లు

మ‌నం క‌నే క‌ల‌లు మ‌న జీవితాన్ని నిర్దేశిస్తాయి. మంచివైతే ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉంటుంది. అందుకు విరుద్ధంగా క‌ల‌లు కంటే జీవితం క‌ల్ల‌ల‌వుతుంది. సుదీర్ఘ రాజ‌కీయ జీవితానుభ‌వం ఉన్న చంద్ర‌బాబు కంటున్న క‌ల‌లు చూస్తుంటే, ఆయ‌న పార్టీ భ‌విష్య‌త్‌పై సందేహం క‌లుగుతోంది. 

చంద్ర‌బాబు త‌న అంటే టీడీపీ గురించి ఆలోచించ‌డం మాని .జ‌గ‌న్ గురించి క‌ల‌వ‌ర‌పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. బహుశా మునుపెన్న‌డూ లేని విధంగా టీడీపీని అథంపాతాళానికి తొక్కేసిన జ‌గ‌న్‌ను మ‌రిచిపోవ‌డం ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యేది కూడా కాక‌పోవ‌చ్చు.

కానీ మ‌న‌సును అదుపులో పెట్టుకోవాలి. చంద్ర‌బాబుకు అది సాధ్యం కావ‌డం లేద‌ని ఆయ‌న న‌డ‌వ‌డిక చూస్తే తెలుస్తోంది. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు. 

త‌న ప్ర‌త్య‌ర్థి, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు 10 నుంచి 30 ఏళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్టు అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్‌) అనే ఢిల్లీ సంస్థ త‌న నివేదిక‌లో పేర్కొన్న‌ట్టు చంద్ర‌బాబు గుర్తు చేశారు. గుంటూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌మ‌న్వ‌య స‌మావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ మాట‌లు అన్నారు.

స‌ద‌రు ఏడీఆర్ సంస్థ జ‌గ‌న్ కేసులు విచారించే న్యాయ వ్య‌వ‌స్థ కాదు. త‌న ప్ర‌త్య‌ర్థి గురించి ఎవ‌రో ఏదో చెబితే, అందులోని సాధ్యాసాధ్యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా చంద్ర‌బాబు ఎందుకంత ఆనంద ప‌డుతున్నారో అర్థం కాదు. 

జ‌గ‌న్‌కైనా, చంద్ర‌బాబుకైనా శాశ్వ‌తంగా శిక్ష విధించే అధికారం ఒక్క ప్ర‌జాకోర్టుకు మాత్ర‌మే ఉంటుంది. ప్ర‌జాకోర్టు త‌ల‌చుకుంటే రాజ‌కీయ భ‌విష్య‌త్ లేకుండా ఇంటికే ప‌రిమితం చేసి, కాళ్లూచేతులూ క‌ట్టేయ‌గ‌ల‌దు. ఇప్పుడు చంద్ర‌బాబు ఆ శిక్ష‌లోనే ఉన్నారు. కానీ ఆ విష‌యాన్ని ఆయ‌న జీర్ణించుకోలేని ప‌రిస్థితిలో ఉన్నారు.

గ‌త కొన్ని నెల‌లుగా లాక్‌డౌన్ కార‌ణంగా చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో ఉంటూ గ‌డ‌ప దాటి బ‌య‌టికి రాలేదు. ఇటీవ‌ల ఒక‌ట్రెండు సార్లు ఆయ‌న విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ ప‌రామ‌ర్శ‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యారు. హైద‌రాబాద్ నుంచి జూమ్ మీటింగ్‌లు నిర్వ‌హిస్తూ మీడియాతోనూ, పార్టీ నేత‌ల‌తోనూ ఆయ‌న మాట్లాడుతున్నారు. 

మ‌రోవైపు ప్ర‌జ‌ల ద‌గ్గ‌రికి వెళ్ల‌కుండా, ఆన్‌లైన్ మీటింగ్‌లకు ప‌రిమిత‌మైతే పార్టీ పుట్టి మునుగుతుంద‌ని సీనియ‌ర్ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. త‌మ ఆవేద‌న‌ను నేరుగా చంద్ర‌బాబుతోనే పంచుకున్న విష‌యం తెలిసిందే.

త‌న పార్టీ శ్రేణులు, నేత‌ల‌తో స‌మావేశ‌మై పార్టీ నిర్మాణం, సంస్థాగ‌తంగా ఉన్న స‌మ‌స్య‌లు, తిరిగి అధికారంలోకి రావాలంటే అనుసరించాల్సిన వ్యూహాలు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించాల్సిన చంద్రబాబు, ఆ ప‌ని మానేసి జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ‌కే ప‌రిమిత‌మ య్యారు. 

తాజాగా గుంటూరు లోక్‌స‌భ నియోజ‌కవ‌ర్గ నేత‌ల‌తో మాట్లాడుతూ జ‌గ‌న్‌కు 10 నుంచి 30 ఏళ్ల వ‌ర‌కు జైలుశిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఏదో సంస్థ చెప్పిన విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డంలో బాబు ఉద్దేశం ఏంటి?  దీని వ‌ల్ల పార్టీకి వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏంటి?

ఈ సంద‌ర్భంగా బాబు ఎంత ప్ర‌స్ట్రేష‌న్‌లో ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు. అధికారం కోల్పోయి హైద‌రాబాద్‌లో ఇంటికే ప‌రిమిత‌మైన బాబు త‌న‌కు తాను గృహ నిర్బంధం విధించుకున్న‌ట్టు కాదా? భ‌విష్య‌త్‌లోనైనా టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌నే భ‌రోసా ఉందా? అందుకు త‌గ్గ కార్యాచ‌ర‌ణ క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న‌ట్టు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. తాను 30 ఏళ్లు అధికారంలో ఉండే ఆలోచ‌న‌తో జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు.

ఒక రాజ‌కీయ పార్టీ అధినేత‌గా సుదీర్ఘ కాలం అధికారంలో ఉండాల‌నే ఆశ ఎవ‌రికైనా ఉంటుంది. జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాలు స‌క్ర‌మంగా అమ‌లై, ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందితే మాత్రం చంద్ర‌బాబుకు శాశ్వ‌త గృహ నిర్బంధం త‌ప్ప‌దు. రోజురోజుకూ పెరుగుతున్న వ‌య‌సు దృష్ట్యా త‌న పార్టీ భ‌విష్య‌త్‌పై దృష్టి పెట్టాల్సిన చంద్ర‌బాబు ... దాన్ని విస్మ‌రించారు.

2024 ఎన్నిక‌ల్లో జ‌గ‌నే అధికారం లోకి వ‌స్తే మాత్రం ....టీడీపీ క‌థ కంచికి, చంద్ర‌బాబు ఇంటికే ప‌రిమితం కావాల్సి వుంటుంది. కావున చంద్ర‌బాబు ప‌దేప‌దే జ‌గ‌న్ గురించి ఆలోచిస్తూ ఆరోగ్యంతో పాటు సొంత పార్టీ భ‌విష్య‌త్‌ను పాడు చేసుకోవ‌ద్దు. జ‌గ‌న్ జైలుకు వెళితే ఆయ‌న భార్యో, చెల్లో పార్టీ ప‌గ్గాలు చేప‌డ‌తారు.

అందువ‌ల్ల వాళ్ల‌కు లేని దిగులు చంద్ర‌బాబుకు ఎందుకు?  ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు ప‌గ‌టి కల‌లు మాని . వాస్త‌వంలోకి రావాలి. త‌న పార్టీ అధికారంలోకి రావాల‌ని క‌ల‌లు క‌న‌డంతో పాటు వాటిని సాకారం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తే ప్ర‌యోజ‌నం ఉంటుంది. 

నన్నెవడూ పీకలేడు

 


×