Advertisement

Advertisement


Home > Politics - Political News

బాబు నోటికో దండమేనా !

బాబు నోటికో దండమేనా !

చంద్రబాబుది తిరిగే కాలు, తిట్టే నోరు. ఈ సంగతి రాజకీయాలు ఆ మాత్రం తెలిసిన వారందరికీ అర్ధమైన విషయమే. అటువంటి బాబు కరోనా వైరస్ సమయంలో కూడా ఎక్కడా రిలాక్స్ అవడంలేదు. ఉన్నదీ లేనిదీ కలిపి మరీ బురద జల్లేస్తున్నారు. జగన్ సర్కార్ మీద బండలు వేస్తూ లాక్ డౌన్ పీరియడ్ లో కూడా యమ బిజీగా ఉంటున్నారు.

బాబు రాజకీయాలు దగ్గరుండి చూసిన మాజీ తమ్ముడు, తాజా వైసీపీ మంత్రి అయిన అవంతి శ్రీనివాస్  పెద్దాయనా మీకో దండం అంటున్నారు. ఈ సమయంలో అయినా కాస్తా నోరు కట్టేసుకోరాదా స్వామీ అని సెటైరికల్ గానే వేడుకుంటున్నారు. రాజకీయాలు మరో పొద్దు చేద్దురు గానీ, కాస్తా గమ్మునుండండి బాబూ అంటూ మంత్రి ప్రాధేయపడుతున్నారు.

అసలే కరోనా వైరస్ అంతూ పొంతూ చిక్కక ప్రపంచం అల్లాడిపోతూంటే మధ్యలో బాబు గారు, ఆయన తమ్ముళ్ళూ అర్ధం పర్ధం లేని విమర్శలతో కొత్త  అయోమయం స్రుష్టిస్తున్నారని మంత్రి వాపోతున్నారు. కీలక సమయాన చేతనైతే చేతులు కలపాలి, లేకపోతే ఇంట్లో  సైలెంట్ గా ఉండాలని మంత్రి సూచించారు. జగన్ సర్కార్ రాత్రీ పగలూ పనిచేస్తూంటే తిట్టడానికి చంద్రబాబుకు మనసెలా వచ్చిందోనని అవంతి మండిపడుతున్నారు.

ఇక ప్రభుత్వ అధికారులను కూడా బాబు వదలడంలేదని, అయితే వారెవరూ తమ పార్టీ మనుషులు కారని, చంద్రబాబు సీఎం గా ఉన్నప్పటి నుంచి ఉన్నారని మంత్రి గుర్తు చేశారు. నాడు అధికారులు మంచి అయ్యారని, ఇపుడు బాబు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి మాత్రం చెడ్డ అయ్యారని ఇదేం లాజిక్కు బాబోరూ అంటూ అవంతి బాగానే తగులుకున్నారు.  మొత్తానికి బాబుకు ఈ తలంటు సరిపోతుందా అంటే అబ్బే  రాటుదేలిన రాజకీయం కదా అక్కడుంది, ఏ మాత్రం సరిపోనే పోదుగా.

చంద్ర‌బాబు ఆ డాక్టర్‌తో మంచి నాటకం ఆడించారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?