cloudfront

Advertisement


Home > Politics - Political News

సింపతీ డ్రామాలు.. ఇక చాలు ఆపు బాబు!

సింపతీ డ్రామాలు.. ఇక చాలు ఆపు బాబు!

ఎన్నికలు ఇలా పూర్తయ్యాయో లేదో.. అలా ఈవీఎంలపై నిందలేసి నానా రాద్ధాంతం చేశారు చంద్రబాబు. మాజీనైపోతాననే భయంతో రీపోలింగ్ అంటూ కేకలేశారు. రాష్ట్రంలోనే కాదు, ఢిల్లీ వెళ్లి మరీ ఈవీఎంలపై యుద్ధం చేస్తాంటూ ప్రకటించి ఈసీ దృష్టిలో పడ్డారు. కానీ ఇప్పుడా ఎపిసోడ్ నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుంటున్నారు బాబు.

బ్యాలెట్ యుగానికి వెళ్దామంటూ చంద్రబాబు ఇచ్చిన పిలుపు ఆయన మానసిక స్థితికి అద్దం పడుతుందనే విమర్శలు వచ్చాయి. దీంతో బాబు ట్రాక్ మార్చారు. ఈవీఎంలపై  చేస్తున్న పోరుకి సొంత పార్టీ నేతలే మద్దతివ్వకపోవడం, మిత్రపక్షాలు కూడా చీదరించుకోవడంతో ఆలోచనలో పడిన చంద్రబాబు.. రివ్యూ మీటింగ్ లంటూ హడావిడి స్టార్ట్ చేశారు.

మాజీ కాబోతున్న తాజా సీఎం చంద్రబాబు చిట్టచివరిసారిగా కేబినెట్ తో భేటీ అయి, అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. అభివృద్ధి ఆగిపోకూడదు జూన్ 8వరకు నేనే ముఖ్యమంత్రిని అంటూ దింపుడుకళ్లెం ఆట ఆడుతున్నారు. 'అబ్బబ్బ ఏం ముఖ్యమంత్రి.. చివరి రోజుల్లో కూడా జనం కోసమే పరితపించిపోతున్నార'నే సింపతీ కోసమే చంద్రబాబు ఈ డ్రామాలాడుతున్నారు.

అయినా జనం ఈనెల 11నే డిసైడ్ అయిపోయారు. జగన్ కే అధికారం అని అన్ని సర్వేలూ ఘంటాపథంగా చెబుతున్నాయి. ఇలాంటి టైమ్ లో చంద్రబాబు నాటకాలు ఎవరిని మెప్పించడానికి? వాస్తవానికి చంద్రబాబు ఇలాంటి మీటింగ్ లు పెట్టినా, పెట్టకపోయినా పాలనలో పెద్దగా మార్పేమీ రాదు. ఇలాంటి సంధి కాలంలో అధికారులెవరూ మంత్రులు చెప్పినమాట వినే పరిస్థితుల్లో ఉండరు. అయినా కూడా చంద్రబాబు తన నటనను మాత్రం ఆపడంలేదు.

మొత్తమ్మీద ఈవీఎంల పనితీరు గురించి తాను చేసిన సిల్లీ కామెంట్స్ పై ఈసీ సీరియస్ గా దృష్టిపెట్టే సరికి.. జనం దృష్టి మరల్చడానికి చంద్రన్న ఆడుతున్న సరికొత్త డ్రామా ఇది అని అర్థమవుతోంది. ఎన్నికల్లోనే కాదు, ఈసీ వద్ద కూడా అతడు ఓడిపోబోతున్నారు.

మాస్ పెట్టుకుని స్టైల్ గా చేస్తే మస్తు ఎంజాయ్