Advertisement

Advertisement


Home > Politics - Political News

మూర్తి కుటుంబానికి కూడా వెన్నుపోటు...?

మూర్తి కుటుంబానికి కూడా వెన్నుపోటు...?

విశాఖలో ఎంవీవీఎస్ మూర్తిని దిగ్గజ వ్యాపారవేత్తగా, విద్యా సంస్థల అధినేతగా జనం చూస్తారు. ఆయన టీడీపీ ఏర్పాటు కాక కంటే ముందే విశాఖ వచ్చి స్థిరపడ్డారు. ఆయన 1980లలో గీతం విద్యా సంస్థలను ప్రారంభించారు.

ఇదిలా ఉంటే గీతం డీమ్డ్ యూనివర్శిటీగా ఎదిగాక వందల ఎకరాలలో విస్తరించింది. ఇక 40 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యాజమాన్యం ఆక్రమించిందన్న కారణంతో విశాఖ జీవీఎంసీ అధికారులు రంగంలోకి దిగి కొన్ని అక్రమ కట్టడాలను కూల్చేసారు.

దీని మీద టీడీపీ  దాని  అనుకూల మీడియా రచ్చ రచ్చ చేశాయి. జగన్ని విలన్ గా విద్వంస‌కారుడిగా చిత్రీకరించి ఆనందించాయి. సరే ప్రభుత్వ నిబంధలన ప్రకారం జగన్ సర్కార్ చేయాల్సింది చేసింది.

మరి అయిదేళ్ళు సీఎంగా ఉన్నపుడు చంద్రబాబు ముందుకు ఈ అక్రమ భూముల క్రమబద్ధీకరణ ఫైల్ ని దివంగత మూర్తి అనేకసార్లు పంపారట. కానీ దాన్ని పట్టించుకోకుండా బాబు పక్కనపెట్టడం వల్లనే రెవిన్యూ రికార్డుల్లో అది అక్రమ భూమిగా ఉండిపోయింది. అక్రమ భూములు కచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే కాబట్టి వైసీపీ సర్కార్ ఆ పని చేసింది.

నిజానికి బాబుకు మూర్తి కుటుంబం మీద ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం లేవని, కేవలం రాజకీయం కోసం ఇపుడు ఏ విషయాన్ని వాడుకుంటున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు. 

కేవలం నామమాత్రపు ధరకే వందల ఎకరాలు గీతం సంస్థకు ఇచ్చిన టీడీపీ పెద్దలు, ఆ కాస్తా 40 ఎకరాల ఆక్రమణను కూడా క్రమబద్ధీకరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంటున్నారు.  మొత్తానికి బాబు ఎంవీవీఎస్ కుటుంబానికి కూడా వెన్నుపోటు పొడిచారన్నది వైసీపీ నేతల ఆరోపణ. మరి గుండెలు బాదుకుంటున్న తెలుగు తమ్ముళ్ళు దీనికేమంటారో కదా.

దుబ్బాకలో రూపాయి ఖర్చు పెట్టకుండా గెలుస్తా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?